Telugu Global
National

చింతన్ శిబిర్ తర్వాత కాంగ్రెస్ హడావిడి

చింతన్ శిబిర్ లో సంచలన నిర్ణయాలేవీ బయటకు రాలేదు కానీ.. కాస్తో కూస్తో కాంగ్రెస్ లో అంతర్మథనం జరిగిందనేమాట వాస్తవం. పార్టీ పగ్గాల అప్పగింతపై తుది నిర్ణయం తీసుకుంటారనుకున్నా.. అది మాత్రం సాధ్యం కాలేదు. అయితే చింతన్ శిబిర్ తర్వాత పార్టీనేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అధినాయకత్వం కూడా కమిటీలను ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే కాస్త హడావిడి మొదలు పెట్టింది. ప్రియాంకకు ప్రాధాన్యం.. 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ, […]

చింతన్ శిబిర్ తర్వాత కాంగ్రెస్ హడావిడి
X

చింతన్ శిబిర్ లో సంచలన నిర్ణయాలేవీ బయటకు రాలేదు కానీ.. కాస్తో కూస్తో కాంగ్రెస్ లో అంతర్మథనం జరిగిందనేమాట వాస్తవం. పార్టీ పగ్గాల అప్పగింతపై తుది నిర్ణయం తీసుకుంటారనుకున్నా.. అది మాత్రం సాధ్యం కాలేదు. అయితే చింతన్ శిబిర్ తర్వాత పార్టీనేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అధినాయకత్వం కూడా కమిటీలను ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే కాస్త హడావిడి మొదలు పెట్టింది.

ప్రియాంకకు ప్రాధాన్యం..
2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, భారత్ జోడో యాత్ర కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో కీలకమైన టాస్క్ ఫోర్స్ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటిచ్చారు. కానీ రాహుల్ ని మాత్రం కేవలం పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాత్రమే ఉంచారు. ప్రియాంకను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయాలంటూ చింతన్ శిబిర్ లో నాయకులంతా ముక్తకంఠంతో కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంకకు కీలకమైన టాస్క్ ఫోర్స్ 2024 కమిటీలో చోటు దక్కడం విశేషం. ఆమెతోపాటు చిదంబరం, జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ కూడా ఇందులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేని ఒకే ఒక్క పేరు సునీల్ కనుగోలు. ఈయన ప్రశాంత్ కిషోర్ ప్రధాన అనుచరుడు. కాంగ్రెస్, పీకే మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆయన సొంత పార్టీ ఆలోచనలతో బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలుని కీలకమైన టాస్క్ ఫోర్స్ కమిటీలో నియమించడం ఆసక్తికరంగా మారింది. మోదీకి పోటీగా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయడం కోసం, ఆయనకు భారీ హైప్ తేవడంకోసం సునీల్ ని నియమించినట్టు తెలుస్తోంది.

రాజకీయ వ్యవహారాల కమిటీలో రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే.. తదితరులు ఉన్నారు. ఇక భారత్ జోడో యాత్ర కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిటీని వేసింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యాత్ర మొదలు పెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. భారత ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ సమస్య, నిత్యావసరాల ధరల పెంపు వంటి అంశాలను ఈ యాత్రలో హైలెట్ చేయబోతున్నారు. జోడో యాత్ర కమిటీలో దిగ్విజ‌య్ సింగ్‌, స‌చిన్ పైల‌ట్‌, శ‌శి థ‌రూర్‌ సహా ఇతర కీలక నేతలు ఉన్నారు.

ALSO READ: జిన్నా టవర్ వర్సెస్ అంబేద్కర్ జిల్లా

First Published:  24 May 2022 8:56 PM GMT
Next Story