Telugu Global
NEWS

భావి ప్రధాని కేటీఆర్.. దావోస్ లో ఇదే హైలైట్ ..

సహజంగా దావోస్ సమావేశాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయి. రాజకీయ నాయకులు హాజరవుతున్నా కూడా ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, వాటికోసం కల్పిస్తున్న మౌలిక వసతుల చుట్టూ చర్చలు జరుగుతాయి. అలాంటిది ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కి అద్భుతమైన ప్రశంస లభించింది. ఆయన భావి ప్రధాని అయినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని. ఎవరీ ఆశా జడేజా మోత్వాని.. ఆశా జడేజా మోత్వాని అమెరికాకు చెందిన […]

KTR
X

సహజంగా దావోస్ సమావేశాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయి. రాజకీయ నాయకులు హాజరవుతున్నా కూడా ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, వాటికోసం కల్పిస్తున్న మౌలిక వసతుల చుట్టూ చర్చలు జరుగుతాయి. అలాంటిది ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కి అద్భుతమైన ప్రశంస లభించింది. ఆయన భావి ప్రధాని అయినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని.

ఎవరీ ఆశా జడేజా మోత్వాని..
ఆశా జడేజా మోత్వాని అమెరికాకు చెందిన ఏంజెల్ ఇన్వెస్టర్. వివిధ స్టార్టప్ కంపెనీలలో ఆమె పెట్టుబడులు పెడతారు. తన భర్త రాజీవ్ మోత్వానీతో కలసి ఇప్పటి వరకు 100కు పైగా స్టార్టప్ లకు ఆమె పెట్టుబడులు అందించారు. భారత్ లో పుట్టిపెరిగిన ఆమె ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. దావోస్ సదస్సులకు ఆమె తప్పనిసరిగా హాజరవుతుంటారు. ఈ ఏడాది దావోస్ సదస్సులో పాల్గొన్న ఆమె.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. 20 ఏళ్ల లోపు కేటీఆర్ భారత ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారామె.

అవగాహన, భావ వ్యక్తీకరణ..
రాజకీయ నాయకుల్లో విషయ పరిజ్ఞానం, అవగాహన, భావ వ్యక్తీకరణ… ఈ మూడు లక్షణాలు ఉన్నవారు అరుదుగా ఉంటారు. ఉద్యోగిగా విదేశాల్లో కెరీర్ మొదలు పెట్టిన కేటీఆర్, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన చురుగ్గా ఉంటున్నారు. ఇలాంటి అరుదైన లక్షణాలున్న వ్యక్తి కచ్చితంగా దేశ రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు ఆశా జడేజా మోత్వాని. అన్ని అంశాల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌, భావ వ్య‌క్తీక‌ర‌ణ ఉన్న‌ ఇలాంటి యువ రాజ‌కీయ నాయ‌కుడిని త‌న జీవితంలో ఎప్పుడూ చూడ‌లేద‌న్నారామె. తెలంగాణకు బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకెళ్లే విధంగా కేటీఆర్ కనిపిస్తున్నారని.. త‌న‌కు సిలికాన్ వ్యాలీ స్టార్ట‌ప్ రోజులు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని ఆశా పేర్కొన్నారు.

First Published:  25 May 2022 12:02 AM GMT
Next Story