Telugu Global
Cinema & Entertainment

ఎఫ్ 3 నీరసం వెనక కారణాలు ఇవేనా?

ఎఫ్ 3 పై భారీ ప్రచారం నడుస్తోంది. యూనిట్ ఊదరగొడుతోంది. టికెట్ రేట్లు కూడా సాధారణంగానే ఉన్నాయి. మరోవైపు ప్రమోషనల్ మెటీరియల్ కూడా రోజుకొకటి బయటకొస్తోంది. ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుంటే, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉండాలి? టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలి. కానీ ఎఫ్ 3 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చప్పగా సాగుతున్నాయి. ఎఫ్3 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 3 రోజుల కిందటే మొదలయ్యాయి. కానీ ఇప్పటికీ టికెట్లు దొరుకుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రైమ్ […]

ఎఫ్ 3 నీరసం వెనక కారణాలు ఇవేనా?
X

ఎఫ్ 3 పై భారీ ప్రచారం నడుస్తోంది. యూనిట్ ఊదరగొడుతోంది. టికెట్ రేట్లు కూడా సాధారణంగానే ఉన్నాయి. మరోవైపు ప్రమోషనల్ మెటీరియల్ కూడా రోజుకొకటి బయటకొస్తోంది. ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుంటే, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉండాలి? టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలి. కానీ ఎఫ్ 3 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చప్పగా సాగుతున్నాయి.

ఎఫ్3 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 3 రోజుల కిందటే మొదలయ్యాయి. కానీ ఇప్పటికీ టికెట్లు దొరుకుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రైమ్ థియేటర్లైన ఐమ్యాక్స్, ఏఎంబీ, పీవీఆర్ లాంటి స్క్రీన్స్ లో కూడా ఇంకా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

అంకెల్లో చూసుకుంటే, ఇప్పటివరకు హైదరాబాద్ లో 37శాతం మాత్రమే ఆక్యుపెన్సీ కనిపించింది. వరంగల్ లో 39 శాతం, కరీంనగర్ లో 26 శాతం, ఖమ్మంలో 26శాతం, నిజామాబాద్ లో 40శాతం, మహబూబ్ నగర్ లో 21 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ జరిగింది. వెంకటేశ్, వరుణ్ లాంటి స్టార్లు నటిస్తున్న సినిమాకు ఇంత తక్కువ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు యువత కాంపిటిటివ్ పరీక్షల కోసం సిద్ధమౌతోంది. పోనీ కుటుంబాలు థియేటర్లకు వస్తాయనుకుంటే.. ఇది నెలాఖరు. ఇలాంటి టైమ్ లో 2వేల రూపాయలు ఖర్చు పెట్టేంత స్తోమత మధ్యతరగతికి ఉండదు. ఈ కారణాల వల్ల ఎఫ్3కి అడ్వాన్స్ బుకింగ్స్ తగ్గినట్టు తెలుస్తోంది. పరీక్షలు పూర్తయిన తర్వాత సినిమాకు ఆదరణ పెరుగుతుందని యూనిట్ భావిస్తోంది.

First Published:  25 May 2022 9:49 AM GMT
Next Story