Telugu Global
NEWS

చేతులెత్తేసిన పోలీసులు.. విధ్వంసంపై ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు

అమలాపురంలో నిరసనకారులు స్వైర విహారం చేశారు. విధ్వంసానికి దిగారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి వీల్లేదంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో విధ్వంసం సాగింది. నిరసనకారుల దాడుల్లో ఎస్పీ,డీఎస్పీతో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా వందలాది మంది యువకులు ర్యాలీగా రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగడంతో పోలీసులు దాదాపు చేతులెత్తేశారు. అమలాపురానికి రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లాల […]

చేతులెత్తేసిన పోలీసులు.. విధ్వంసంపై ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు
X

అమలాపురంలో నిరసనకారులు స్వైర విహారం చేశారు. విధ్వంసానికి దిగారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి వీల్లేదంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో విధ్వంసం సాగింది. నిరసనకారుల దాడుల్లో ఎస్పీ,డీఎస్పీతో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా వందలాది మంది యువకులు ర్యాలీగా రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగడంతో పోలీసులు దాదాపు చేతులెత్తేశారు. అమలాపురానికి రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలు తరలిస్తున్నారు.

మంత్రి ఇంటికి నిప్పు పెట్టి కాల్చేశారు. ఈ ఘటనపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వివాదం చేయడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి వస్తే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడుతామని చంద్రబాబు చెప్పారని, జనసేన కూడా సమర్ధించిందని ఇప్పుడు ఇలా దీన్ని రాజకీయం చేయడం సరైనది కాదన్నారు.

ప్రజల విజ్ఞప్తి మేరకు జిల్లాకు కోనసీమ పేరు పెట్టినట్టు ఎంపీ వివరించారు. అది కూడా కోనసీమ పేరు తీయకుండానే అంబేద్కర్ పేరును జోడించామని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం సరికాదని దమ్ముంటే టీడీపీ, జనసేన ప్రకటించాలన్నారు. తొలుత పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఇప్పుడు మాత్రం విధ్వంసానికి దిగడం ఎంతవరకు సమంజసం అని చంద్రబోస్ ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమపై ఈ క్షుద్రరాజకీయాలు సరికాదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇద్దరూ ఈ విధ్వంసానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీలే ఈ విధ్వంసం వెనుక ఉన్నాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.

అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయని ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అదేమీ రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రధాన పార్టీలన్నీ ఈ నిర్ణయానికి మద్దతు పలికాయన్నారు. అంబేద్కర్ ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా చూడకూడదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కొన్ని శక్తులు తెర వెనుక నుంచి నిరసనకారులను రెచ్చగొడుతున్నాయన్నారు.

First Published:  24 May 2022 10:21 AM GMT
Next Story