Telugu Global
NEWS

ఎండలు ఎక్కువైతే నిద్ర తక్కువవుతుందా?

వాతావరణ మార్పులు.. మనిషి నిద్రపై కూడా ప్రభావాన్ని చూపుతాయని తాజాగా ఓ స్టడీలో తేలింది. భవిష్యత్తులో మారబోయే ఉష్ణోగ్రతలు మన నిద్రా సమయాన్ని తగ్గించే ప్రమాదముందని ఈ స్టడీ వెల్లడిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు.. మనుషుల నిద్రపైన ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని ‘వన్ ఎర్త్’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం చెప్తోంది. ఈ అధ్యయనం ప్రకారం.. 2099 నాటికి ప్రతి వ్యక్తి ఏడాదికి 50 నుంచి 58 గంటల […]

ఎండలు ఎక్కువైతే నిద్ర తక్కువవుతుందా?
X

వాతావరణ మార్పులు.. మనిషి నిద్రపై కూడా ప్రభావాన్ని చూపుతాయని తాజాగా ఓ స్టడీలో తేలింది. భవిష్యత్తులో మారబోయే ఉష్ణోగ్రతలు మన నిద్రా సమయాన్ని తగ్గించే ప్రమాదముందని ఈ స్టడీ వెల్లడిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు.. మనుషుల నిద్రపైన ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని ‘వన్ ఎర్త్’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం చెప్తోంది. ఈ అధ్యయనం ప్రకారం.. 2099 నాటికి ప్రతి వ్యక్తి ఏడాదికి 50 నుంచి 58 గంటల నిద్రను కోల్పోయే ప్రమాదం ఉందట. అంతేకాదు, పేద దేశాల ప్రజలతోపాటు వృద్ధులు, మహిళల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఈ స్టడీ తెలిపింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు మనుషుల్లో పలురకాల శారీరక, మానసిక సమస్యలకు దారితీయొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

ఇదే విషయంపై గతంలో కొన్ని అధ్యయనాలు జరిగినప్పటికీ ఇప్పుడు మాత్రం సరైన సాక్ష్యాలు అందుబాటులోకి వచ్చాయని సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టులు ఈ అధ్యయనం కోసం.. 68 దేశాల్లోని 47 వేలకుపైగా ప్రజలకు యాక్సిలరోమీటర్ ఆధారిత స్లీప్-ట్రాకింగ్ రిస్ట్‌బ్యాండ్‌లు అందజేసి వారి నిద్రాసమయాన్ని పరీక్షించారు. చాలా కాలం పాటు చేసిన ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భవిష్యత్తులో మరణాలతోపాటు ఆసుత్రుల బారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతుందట.

‘వేడి వాతావరణం కారణంగా.. వయసు పైబడిన వాళ్లు ఆలస్యంగా నిద్రపోతారు. ముందుగానే మేల్కొంటారు. సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నిద్రను తగ్గిస్తాయని సాక్ష్యాలతో సహా రుజువైంది’ అని కోపెన్‌హాగెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకర్త కెల్టన్ మైనర్ అన్నారు.

‘సాధారణంగా మనకు నిద్ర పట్టాలంటే బయట ఉష్ణోగ్రత.. శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉండాలి. అందుకే రాత్రి వేళల్లో శరీరం మనకు తెలియకుండానే కొంత వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. దీంతో శరీరం కాస్త చల్లబడి, నిద్రపడుతుంది. అయితే చుట్టూ వాతావరణం మన శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న రాత్రుల్లో నిద్ర సమయం సగటున 14 నిమిషాలు తగ్గుతుంది. వేడి పెరిగే కొద్దీ నిద్ర సమయం కూడా ఏడు గంటల కంటే తక్కువకు పడిపోతుంటుంది.” అని అధ్యయనకారుడు మైనర్ చెప్పారు.

ALSO READ: వయసుని వెనక్కు తగ్గించొచ్చట! ఎలాగంటే..

First Published:  24 May 2022 6:03 AM GMT
Next Story