Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమా కోసం రాజమౌళి రెడీ

ఆర్ఆర్ఆర్ హంగామా ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. దీంతో రాజమౌళి, తన నెక్ట్స్ సినిమా పని మీద పడ్డాడు. త్వరలోనే మహేశ్ హీరోగా సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. దానికి సంబంధించిన కథాచర్చల్ని వచ్చే వారం నుంచి మొదలుపెట్టబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లాడు రాజమౌళి. నెల రోజుల పాటు విదేశాల్లోనే ఉన్నాడు. అలా విదేశాల్లో గడిపి, ఈమధ్యే హైదరాబాద్ తిరిగొచ్చాడు. వచ్చే వారం నుంచి తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి […]

మహేష్ సినిమా కోసం రాజమౌళి రెడీ
X

ఆర్ఆర్ఆర్ హంగామా ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. దీంతో రాజమౌళి, తన నెక్ట్స్ సినిమా పని మీద పడ్డాడు. త్వరలోనే మహేశ్ హీరోగా సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. దానికి సంబంధించిన కథాచర్చల్ని వచ్చే వారం నుంచి మొదలుపెట్టబోతున్నాడు.

ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లాడు రాజమౌళి. నెల రోజుల పాటు విదేశాల్లోనే ఉన్నాడు. అలా విదేశాల్లో గడిపి, ఈమధ్యే హైదరాబాద్ తిరిగొచ్చాడు. వచ్చే వారం నుంచి తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి కథాచర్చల్లో పాల్గొంటాడు.

రాజమౌళి, విజయేంద్రప్రసాద్ కలిసి 2-3 స్టోరీలు సిద్ధం చేయబోతున్నారు. వీటిని మహేష్ కు వినిపిస్తారు. వీటిలో ఏ స్టోరీలైన్ మహేష్ కు నచ్చితే, అప్పుడు ఆ స్టోరీలైన్ పై స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. తాజా సమాచారం ప్రకారం.. జులైలో మహేష్-రాజమౌళి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాపై దృష్టిపెట్టాడు మహేష్. జులై నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ అవుతుంది. రాజమౌళితో సినిమా కోసం రెండేళ్ల సమయాన్ని కేటాయించాడు మహేష్. ఈ రెండేళ్లలో మహేష్ తో రాజమౌళి సినిమా పూర్తిచేయాల్సి ఉంటుంది.

ALSO READ: కేజీఎఫ్3 ఇప్పట్లో ప్రారంభం అవ్వదు

First Published:  24 May 2022 5:57 AM GMT
Next Story