Telugu Global
NEWS

బీజేపీ వ్యతిరేకులా? కాన్వొకేషన్‌కు నో ఎంట్రీ

యూనివర్శిటీలు, కాలేజీలలో రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల ప్రాభవం తగ్గి చాలాకాలమైంది. ఇప్పుడంతా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే విద్యార్థుల్లో కూడా కొంతమందికి రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. నచ్చిన పార్టీకి జిందాబాద్ కొట్టడం, నచ్చిన నాయకుడిని సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడం.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) విద్యార్థులకు ఇప్పుడో చిక్కొచ్చి పడింది. ఈనెల 26న ISB స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ స్నాతకోత్సవానికి బీజేపీ వ్యతిరేక […]

బీజేపీ వ్యతిరేకులా? కాన్వొకేషన్‌కు నో ఎంట్రీ
X

యూనివర్శిటీలు, కాలేజీలలో రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల ప్రాభవం తగ్గి చాలాకాలమైంది. ఇప్పుడంతా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే విద్యార్థుల్లో కూడా కొంతమందికి రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. నచ్చిన పార్టీకి జిందాబాద్ కొట్టడం, నచ్చిన నాయకుడిని సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడం.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) విద్యార్థులకు ఇప్పుడో చిక్కొచ్చి పడింది. ఈనెల 26న ISB స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ స్నాతకోత్సవానికి బీజేపీ వ్యతిరేక భావాలు ఉన్నవారిని ముందుగానే పక్కనపెడుతున్నారు. కాలేజీ స్టూడెంట్లలో బీజేపీ వ్యతిరేకత ఉన్నవారిని గుర్తించి మరీ స్నాతకోత్సవంలో వారికి నో ఎంట్రీ అని చెప్పేస్తున్నారట అధికారులు. దీనికి గల ఏకైక కారణం ఆ కాన్వొకేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథి కావడం.

మోదీ వస్తున్నారు కాబట్టి.. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ISB అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారనే అనుమానం ఉన్నవారిని ముందుగానే అడ్డుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయా విద్యార్థులపై నిఘా పెట్టారు. వారి పోస్టింగ్ ల ద్వారా వారు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమా, వ్యతిరేకమా అని నిర్థారించుకుంటున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచి కాన్వొకేషన్ కి వారిని పక్కనపెడుతున్నారు.

విద్యార్థులపై వివక్ష ఎందుకు..?

విద్యార్థులపై వివక్ష సరికాదని, అందులోనూ.. ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న బిజినెస్ స్కూల్ లో చదివే విద్యార్థులపై ఇలా నిఘా పెట్టడం సరికాదంటున్నారు సీపీఐ నేత నారాయణ. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చూపించే అవకాశముందని, అలాంటివారిని అనుమానించడం, అవమానించడం సరికాదంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి భావాలు వ్యక్తపరిచే హక్కు ఉందని నారాయణ అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా భావాలను వ్యక్తపరచడానికి వీల్లేకుండా చేసే నియంతృత్వ ధోరణి సరికాదన్నారు. దీనివల్ల బిజినెస్‌ స్కూల్ లో చదివే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేవారిగా తయారవుతారా? లేక నియంతల్లాగా మారతారా? అని ప్రశ్నించారు నారాయణ. వెంటనే నిఘా ఎత్తివేసి.. విద్యార్థులందరినీ భేషరతుగా స్నాతకోత్సవంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే మోదీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు నారాయణ.

First Published:  24 May 2022 1:04 AM GMT
Next Story