Telugu Global
NEWS

ఆ ఎంపీ, ఎమ్మెల్యేలు వస్తే తరిమేయండి..!

గత కొన్నాళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్న మావోయిస్టు పార్టీ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా అందరినీ హెచ్చరిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అరకు ఎంపీ జి. మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్షిని గ్రామాల్లోకి రానియ్యొద్ద‌ని.. ఒక వేళ వస్తే తన్ని తరిమేయాలని సీపీఎం మావోయిస్టు పార్టీ సోమవారం తీవ్రంగా హెచ్చరించింది. ఆదివాసీ ఓట్లతో అధికారాన్ని చేపట్టిన వీరిద్దరూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, […]

maoist-party-warns-ycp-mp-goddeti-madhavi-mla-bhagyalakshmi
X

గత కొన్నాళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్న మావోయిస్టు పార్టీ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా అందరినీ హెచ్చరిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అరకు ఎంపీ జి. మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్షిని గ్రామాల్లోకి రానియ్యొద్ద‌ని.. ఒక వేళ వస్తే తన్ని తరిమేయాలని సీపీఎం మావోయిస్టు పార్టీ సోమవారం తీవ్రంగా హెచ్చరించింది.

ఆదివాసీ ఓట్లతో అధికారాన్ని చేపట్టిన వీరిద్దరూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, అందుకే వాళ్లను టార్గెట్ చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్పులపాలు అయ్యిందని, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిన రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తారని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం దోపిడీ చేయడాన్ని కళగా మలుచుకున్నదని, అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లాను ఏర్పాటు చేసిందని మావోయిస్టులు ఆ లేఖలో వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా అల్లూరి వర్ధంతిని ప్రభుత్వం నిర్వహించిందని.. ఇది బలి ఇచ్చే ముందు జంతువులకు పూజ చేసే లాంటిదే అని ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ ఆ లేఖలో ఆరోపించారు.

ఏపీలో జీవో 97ను రద్దు చేసినప్పటికీ.. అన్‌రాక్ కంపెనీతో ఉన్న ఒప్పదం మాత్రం రద్దు చేయలేదని గణేష్ ఆ లేఖలో గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే కొత్తగా జీవో 89ను తెరపైకి తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కానీ మైనింగ్‌కు ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు సహకరిస్తే తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది.

First Published:  23 May 2022 9:00 PM GMT
Next Story