Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్3 ఇప్పట్లో ప్రారంభం అవ్వదు

కేజీఎఫ్ ఛాప్టర్ 1 వచ్చింది. ఘన విజయం సాధించింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 వచ్చింది. అంతకుమించి విజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా వస్తుంది. కచ్చితంగా వస్తుంది కానీ ఇదే ఊపులో రాదు. కాస్త టైమ్ పడుతుంది. ఛాప్టర్-2 తర్వాత హీరో, దర్శకుడు గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ 2 సినిమాలు ప్రకటించాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఓ […]

కేజీఎఫ్
X

కేజీఎఫ్ ఛాప్టర్ 1 వచ్చింది. ఘన విజయం సాధించింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 వచ్చింది. అంతకుమించి విజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా వస్తుంది. కచ్చితంగా వస్తుంది కానీ ఇదే ఊపులో రాదు. కాస్త టైమ్ పడుతుంది. ఛాప్టర్-2 తర్వాత హీరో, దర్శకుడు గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ప్రశాంత్ నీల్ ఆల్రెడీ 2 సినిమాలు ప్రకటించాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తయి, రిలీజ్ అయ్యేసరికి కనీసం రెండేళ్లు పడుతుంది. అంటే, ఈ 2 ఏళ్లలో కేజీఎఫ్-3 రాదని అర్థం.

అటు హీరో యష్ కూడా కేజీఎఫ్ ఫ్రాంచైజీకి విరామం ప్రకటించాడు. ఈ రెండేళ్లలో వేరే దర్శకులతో 2 సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. సో.. ఎట్నుంచి ఎటు చూసుకున్నా.. కేజీఎఫ్-2 స్టార్ట్ అయ్యేసరికి 2025 అవుతుంది. అక్కడ్నుంచి ఫాస్ట్ గా షూట్ చేసినా.. ఛాప్టర్-3 థియేటర్లలోకి వచ్చేసరికి మినిమం 2026 అవుతుంది.

First Published:  24 May 2022 5:52 AM GMT
Next Story