Telugu Global
NEWS

హంతకులకు టీడీపీ రక్ష.. ప్రజలకు వైసీపీ శ్రీరామ రక్ష..

డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిస్పక్షపాతంగా వ్యవహరించిందని, అధికార పార్టీ నేత అయినా, చట్టసభ సభ్యుడైనా సరే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు హోం మంత్రి తానేటి వనిత. తమ ప్రభుత్వం ప్రజా పక్షం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ లబ్ధికోసం టీడీపీ వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారామె. హంతకులకు అండగా టీడీపీ.. టీడీపీ హయాంలో ప్రజా ప్రతినిధులు […]

home minister vanitha
X

డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిస్పక్షపాతంగా వ్యవహరించిందని, అధికార పార్టీ నేత అయినా, చట్టసభ సభ్యుడైనా సరే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు హోం మంత్రి తానేటి వనిత. తమ ప్రభుత్వం ప్రజా పక్షం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ లబ్ధికోసం టీడీపీ వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారామె.

హంతకులకు అండగా టీడీపీ..

టీడీపీ హయాంలో ప్రజా ప్రతినిధులు తప్పులు చేసినా చూసీ చూడనట్టు వదిలేసేవారని, హంతకుల పక్షాన నిలబడేవారని అన్నారు మంత్రి తానేటి వనిత. బోండా ఉమా కుమారుడు యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాడని, కర్నూలులో వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యకు కేఈ కృష్ణమూర్తి కారకుడు కాదా అని ప్రశ్నించారామె. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం హంతకులకు అండగా ఉందని, కానీ వైసీపీ ప్రభుత్వం పేదలు, బడుగుబలహీన వర్గాలు, దళితులు, న్యాయం పక్షాన నిలబడిందని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదనే విషయం ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ తో మరోసారి రుజువైందని చెప్పారు.

సీఎం జగన్ హయాంలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పాలన సాగుతోందని చెప్పారు హోం మంత్రి వనిత. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీకి మాట్లాడే అర్హత కూడా లేదన్నారామె. ప్రజలు కూడా ఈ విషయంలో ప్రతిపక్షాల తీరుని అర్థం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత గంటల వ్యవధిలో పోలీసులు స్పందించారని, బాధితుల పక్షాన నిలబడ్డారని, వారికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. అదే సమయంలో టీడీపీ హడావిడిగా వారికి నష్టపరిహారం ఇచ్చి రాజకీయం చేయాలని చూసిందని, బాధితుల్ని ఆకట్టుకోవాలని కుటిల పన్నాగాలు పన్నిందని విమర్శించారు. టీడీపీ హయాంలో నాయకులు ఎలాంటి దుర్మార్గాలు చేసినా పార్టీ, ప్రభుత్వం వారికి మద్దతుగా ఉండేదని, వైసీపీ ఒక్కటే ప్రజల పార్టీ అని చెప్పారు వనిత.

First Published:  23 May 2022 8:40 PM GMT
Next Story