Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్-శంకర్ సినిమా ఫస్ట్ లుక్ రెడీ

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. స్వయంగా దర్శకుడు శంకర్, ఈ ఫస్ట్ లుక్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట. 2 రోజుల పాటు ఫొటోషూట్ నిర్వహించి, చరణ్ పై ఈ ఫస్ట్ లుక్ ను రెడీ చేశారట. ప్రస్తుతానికైతే ఫస్ట్ […]

Ram charan and shankar movie
X

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. స్వయంగా దర్శకుడు శంకర్, ఈ ఫస్ట్ లుక్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట.

2 రోజుల పాటు ఫొటోషూట్ నిర్వహించి, చరణ్ పై ఈ ఫస్ట్ లుక్ ను రెడీ చేశారట. ప్రస్తుతానికైతే ఫస్ట్ లుక్ సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది సస్పెన్స్. నిర్మాత దిల్ రాజు, ఎఫ్3 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత చరణ్ సినిమా ఫస్ట్ లుక్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సినిమాలో చరణ్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఒక షేడ్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా, మరో షేడ్ లో తండ్రిపాత్రలో కనిపించబోతున్నాడు. యంగ్ చరణ్ పాత్రకు కియరా అద్వానీ, తండ్రి పాత్ర కు అంజలిని హీరోయిన్ గా తీసుకున్నారు. తండ్రి పాత్రకు సంబంధించి రాజమండ్రిలో దాదాపు షూటింగ్ పూర్తి చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్.

First Published:  24 May 2022 5:45 AM GMT
Next Story