Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ తో ఆడుకున్న బిత్తిరి సత్తి

ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ ఫేవరెట్స్ లో బిత్తిరి సత్తి ఒకడు. ఈయన చేసిన ఇంటర్వ్యూలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. అందుకే సినీ ప్రముఖులంతా తమ సినిమా ప్రచారం కోసం బిత్తిరి సత్తితో ప్రచారం చేయించుకుంటారు. రీసెంట్ గా సర్కారువారి పాట కోసం మహేష్ ను ఇంటర్వ్యూ చేసిన బిత్తిరి సత్తి, ఈసారి ఎఫ్3 యూనిట్ కోసం రంగంలోకి దిగాడు. ఎఫ్3 ప్రమోషన్ కోసం అనీల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ ను ఒకేసారి ఇంటర్వ్యూ చేశాడు […]

వరుణ్ తేజ్ తో ఆడుకున్న బిత్తిరి సత్తి
X

ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ ఫేవరెట్స్ లో బిత్తిరి సత్తి ఒకడు. ఈయన చేసిన ఇంటర్వ్యూలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. అందుకే సినీ ప్రముఖులంతా తమ సినిమా ప్రచారం కోసం బిత్తిరి సత్తితో ప్రచారం చేయించుకుంటారు. రీసెంట్ గా సర్కారువారి పాట కోసం మహేష్ ను ఇంటర్వ్యూ చేసిన బిత్తిరి సత్తి, ఈసారి ఎఫ్3 యూనిట్ కోసం రంగంలోకి దిగాడు.

ఎఫ్3 ప్రమోషన్ కోసం అనీల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ ను ఒకేసారి ఇంటర్వ్యూ చేశాడు బిత్తిరి సత్తి. ఎప్పట్లానే తన కామెడీ పంచ్ లతో ఆకట్టుకున్నాడు. అయితే వరుణ్ తేజ్ ను మాత్రం ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడమే వరుణ్ తేజ్ ను అరుణతేజం అని పిలవడం మొదలుపెట్టాడు సత్తి. ఇక అక్కడ్నుంచి నవ్వులే నవ్వులు.

ఇంటర్వ్యూలో భాగంగా చిలకజోస్యం మొదలుపెట్టాడు సత్తి. లేని చిలకను ఉన్నట్టుగా ఊహించుకొని జాతకాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా అరుణతేజంకు త్వరలోనే పెళ్లవుతుందని జోస్యం చెప్పాడు. దాన్ని వరుణ్ తేజ్ తిప్పికొట్టాడు. ఇప్పట్లో తనకు పెళ్లి ఉద్దేశం లేదని ప్రకటించాడు. ఆ వెంటనే చిలకజోస్యం నుంచి మరో కార్డు బైటకు తీసిన సత్తి, ఈసారి వరుణ్ తేజ్ కు మంచం ఫొటో చూపించాడు. మంచం రెడీగా ఉందని, పెళ్లి చేసుకోవాలంటూ టీజ్ చేశాడు.

అయితే ఓవైపు సత్తి, వరుణ్ తేజ్ తో ఆడుకుంటుంటే.. మరోవైపు వెంకటేష్ మాత్రం సత్తిని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. సత్తికే రివర్స్ లో పంచ్ లేశాడు. ఓవరాల్ గా బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ ఎఫ్3 ప్రమోషన్ లో హైలెట్ గా నిలిచింది.

First Published:  24 May 2022 5:55 AM GMT
Next Story