Telugu Global
NEWS

అనంతబాబు అరాచకాల చిట్టా.. మచ్చుకు కొన్ని..

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యతో ఎమ్మెల్సీ అనంతబాబు పాపాల చిట్టా చర్చకు వచ్చింది. అతడి అరాచకాలపై ఇప్పుడు ఏజెన్సీలో ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. ఈ రూపంలో ఎమ్మెల్సీ పాపం పండిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో అతడి అరాచకాల చరిత్రపై పుంకానుపుంకాలుగా కథనాలు వస్తున్నాయి. అనంతబాబు క్రిమినల్ చరిత్రను చూస్తే.. 1. అనంతబాబు కుటుంబానిది ఏజెన్సీ ప్రాంతం కాదు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం నుంచి కొన్ని దశాబ్దాల క్రితం వలస వచ్చారు. అనంత బాబు తండ్రి అడ్డ […]

అనంతబాబు అరాచకాల చిట్టా.. మచ్చుకు కొన్ని..
X

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యతో ఎమ్మెల్సీ అనంతబాబు పాపాల చిట్టా చర్చకు వచ్చింది. అతడి అరాచకాలపై ఇప్పుడు ఏజెన్సీలో ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. ఈ రూపంలో ఎమ్మెల్సీ పాపం పండిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో అతడి అరాచకాల చరిత్రపై పుంకానుపుంకాలుగా కథనాలు వస్తున్నాయి. అనంతబాబు క్రిమినల్ చరిత్రను చూస్తే..

1. అనంతబాబు కుటుంబానిది ఏజెన్సీ ప్రాంతం కాదు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం నుంచి కొన్ని దశాబ్దాల క్రితం వలస వచ్చారు. అనంత బాబు తండ్రి అడ్డ తీగల సమితి అధ్యక్షుడిగా చేశారు. ఆయన కూడా ఇలాగే ఏజెన్సీలో గిరిజనులపై జులం ప్రదర్శించేవారు. దాంతో పలుమార్లు హెచ్చరించి 1996లో ఒకరోజు నక్సలైట్లు చంపేశారు. దాంతో అనంతబాబు శకం మొదలైంది. తొలుత కాంగ్రెస్‌లో ఒక కార్యకర్త తరహాలో చేరారు. 1998లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి ఎదురుగా వచ్చిన ప్రత్యర్థుల ర్యాలీపై దాడి చేసిన అనంతబాబు ప్రత్యర్థుల తలలు పగిలేలా కొట్టి నాయకుల దృష్టిలో పడ్డారు.

2. ఆ తర్వాత గంజాయి, కలప వంటివి దొంగగా అమ్ముతూ సామ్రాజ్య విస్తరణ మొదలుపెట్టాడు. ఇతడి ఎదుగుదలకు అడ్డులేకుండాపోవడానికి.. ప్రధాన కారణాలు రంపచోడవరం గిరిజన ప్రాంతం కావడం, వారు సులువుగా ఇతడి బెదిరింపులకు భయపడిపోవడం. అదే సమయంలో తన బంధువులు( జోత్యుల నెహ్రు ఇతడికి మేనమామ) పలు పార్టీల్లో కీలక నేతలుగా ఉండడంతో ఇతడు అన్ని ప్రధాన పార్టీలకు ముద్దుల వీరప్పన్‌గా మారిపోయాడు.

3. ఇతడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి . అయినప్పటికీ తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ సృష్టించి 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. వైసీపీ టికెట్ కూడా ప్రకటించింది. కాకపోతే అప్పటి కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది ఈ ఫేక్ సర్టిఫికేట్‌కు చెక్ పెట్టారు. దాంతో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వంతల రాజేశ్వరి ప్రధాన అభ్యర్థిగా మారి విజయం సాధించారు. ఆమె గెలిచినప్పటికీ.. ఆమె లెటర్‌ హెడ్‌ను కూడా అనంతబాబు తన దగ్గరేపెట్టుకున్నారన్న కథనాలు అప్పట్లో వచ్చాయి. ఏటీఎం కార్డు కూడా తన దగ్గరే ఉంచుకుని ఎమ్మెల్యేగా ఆమెకు వచ్చే గౌరవవేతనాన్ని కూడా తానే తీసుకుని, అంతోఇంతో ఎమ్మెల్యేకు ఇచ్చేవారని చెబుతారు. ఇతడి ఆగడాలను జగన్‌ కూడా నియంత్రించేందుకు ఆసక్తి చూపకపోవడంతో, ఆ టార్చర్‌ భరించలేకే ఆమె వైసీపీకి దండం పెట్టి టీడీపీలో చేరినట్టు ప్రచారం ఉంది.

4. రాజేశ్వరి స్థానంలో 2019ఎన్నికల నాటికి.. టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేయించి ధనలక్ష్మిని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా గతంలో రాజేశ్వరి తరహాలోనే ఉంది. ప్రతి నిర్ణయం అనంతబాబే తీసుకుంటారు. కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే వద్దకు కాకుండా, అతడి వద్దకే వెళ్తుంటారు.

5. ఇతడి ప్రధాన ఆదాయ వనరులు.. కలప, గంజాయి, రంగు రాళ్లు, చేపల చెరువులు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తనకు ఇబ్బంది లేకపోవడంతో 20ఏళ్లలో కొన్ని వందల ఎకరాల్లో మహావృక్షాలను సైతం నరికి అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నాడు అనంతబాబు. అడ్డతీగల ఏజెన్సీలో గిరిజనుల ప్రాణాలను పణంగా పెట్టి రంగు రాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. ఎవరైనా అధికారులు వెళ్లేందుకు ప్రయత్నిస్తే అమాయక గిరిజనులతో వారిపై రాళ్ల దాడులు చేయించిన చరిత్ర కూడా ఇతడికి ఉంది.

6. ఏజెన్సీలో చెక్‌పోస్టులపై ఇతడికి ఉన్నంత పట్టు మరొకరికి లేదని చెబుతారు. పశువుల అక్రమ రవాణాలోనూ ఈయన పాత్ర కీలకం. అడిగే వాడే లేకపోవడంతో గిరిజనుల పొలాలకు వెళ్లాల్సిన నీటిని తన చేపల చెరువులకు మళ్లిస్తున్నాడు. 2013లో తన చేపల చెరువుకు అడ్డుగా ఉన్నాయని విద్యుత్ స్తంభాలను తొలగించాడు. దాంతో 15 రోజుల పాటు దాదాపు 25 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కానీ ఏ పార్టీ ప్రశ్నించింది లేదు. 100 ఎకరాల్లో చేపల చెరువు ఉంది. ఆ పక్కనే విస్తరిస్తూ వెళ్తున్నారు. 15 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా అనంతబాబు చేపల చెరువుగా మారింది.

7. కోడి పందాలు, పేకాట వ్యవహారాలకూ ఇతడి అండ ఉండాల్సిందే. ఇటీవల కాలంలో గంజాయి వ్యాపారంలోనూ అనంతబాబు చేయి తిరిగిందని ప్రచారం ఉంది. 2019 ముందు ఇతడిపై రౌడీషీట్ ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కూడా ఎత్తివేశారు. 2021 నవంబర్‌లో ఎమ్మెల్సీగా జగన్‌మోహన్ రెడ్డి ఇతడిని ఎంపిక చేశారు. అనంతబాబును కూడా ఒకసారి మావోయిస్టులు ఎత్తికెళ్లి ప్రజాకోర్టు నిర్వహించి హెచ్చరించి వదిలేశారు. అయినా తీరు మారలేదు.

First Published:  23 May 2022 9:19 PM GMT
Next Story