Telugu Global
NEWS

రణరంగంగా మారిన అమలాపురం... మంత్రి ఇంటికి నిప్పు

అమలాపురం రణరంగంగా మారింది…. మంత్రి విశ్వరూప్ , ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్ళకు,ఎస్పీ వాహనానికి నిప్పు పెట్టారు …. పోలీసులపై రాళ్ళు రువ్వారు…. వాహనాలు తగలబెట్టారు….పోలీసులు లాఠీ చార్జ్ చేశారు…. గాలిలోకి కాల్పులు జరిపారు…. ఇదంతా ఎందుకు జరుగుతోంది ? ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన లో భాగంగా అమలాపురం జిల్లా కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన డిమాండ్ల మేరకు ఆ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారు. దాంతో కోనసీమ […]

రణరంగంగా మారిన అమలాపురం... మంత్రి ఇంటికి నిప్పు
X

అమలాపురం రణరంగంగా మారింది…. మంత్రి విశ్వరూప్ , ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్ళకు,ఎస్పీ వాహనానికి నిప్పు పెట్టారు …. పోలీసులపై రాళ్ళు రువ్వారు…. వాహనాలు తగలబెట్టారు….పోలీసులు లాఠీ చార్జ్ చేశారు…. గాలిలోకి కాల్పులు జరిపారు….

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన లో భాగంగా అమలాపురం జిల్లా కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన డిమాండ్ల మేరకు ఆ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారు. దాంతో కోనసీమ ఒక్క సారి భగ్గుమంది. అంబేద్కర్ పేరును తీసివేయాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. అమలాపురం ఇప్పటికే 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు అమలాపురం కలెక్టరేట్ ముట్టడించేందుకు సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ భవనాన్ని ముట్టడించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. నిరసనకారులకు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణంగా మారింది. యువకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరు యువకులు ఓ ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీ, గన్ మెన్లతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అటు పోలీసు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు.

అమలాపురం వీధుల్లో సాయంత్రం విధ్వంసానికి దిగారు. వందలాది మంది రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. దాంతో మంత్రి నివాసం మంటల్లో చిక్కుకుంది. విశ్వరూప్ ఇంటి వద్ద పోలీసుల ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమలాపురంలోని ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిని కూడా నిరసనకారులు దగ్ధం చేశారు.

కోనసీమ సాధన సమతి ఆధ్వర్యంలో ఈ విధ్వంసం జరిగింది. ఎస్పీ వాహనానికి నిప్పు పెట్టారు. రెండు ప్రైవేట్ బస్సులను దహనం చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయంపైనా దాడి జరిగింది. క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్‌ను బయటకు తెచ్చి కాల్చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపై నిరసనకారులు దాడులకు దిగారు. ఒక దశలో ఎస్పీ సుబ్బారెడ్డిపైకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. రాళ్లదాడి నుంచి సుబ్బారెడ్డి తృటిలో తప్పించుకున్నారు.

మరో వైపు పోలీసులు అదనపు బలగాలను అమలాపురంలో మోహరించారు. కొన్ని చోట్ల గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

First Published:  24 May 2022 8:32 AM GMT
Next Story