Telugu Global
National

పింఛన్ విషయంలో కొత్త రూల్స్..

ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ లో ఉన్నంతకాలం నెలజీతం వస్తుంది. ఆ తర్వాత పింఛన్ వస్తుంది. విధి నిర్వహణలో ఉండగా చనిపోతే కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పింఛన్ ఇస్తారు. మరి ఆ ఉద్యోగి కనిపించకుండా పోతే..? ఉద్యోగి అకస్మాత్తుగా అదృశ్యం అయితే ఏం చేస్తారు..? వారు తిరిగొచ్చే వరకు జీతం రాదు, పోనీ కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుందా అంటే అదీ లేదు. ఉద్యోగి మరణించలేదు కాబట్టి డెత్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కుదరదు. ఇలాంటి సమస్యతో చాలామంది ఇప్పటి […]

పింఛన్ విషయంలో కొత్త రూల్స్
X

ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ లో ఉన్నంతకాలం నెలజీతం వస్తుంది. ఆ తర్వాత పింఛన్ వస్తుంది. విధి నిర్వహణలో ఉండగా చనిపోతే కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పింఛన్ ఇస్తారు. మరి ఆ ఉద్యోగి కనిపించకుండా పోతే..? ఉద్యోగి అకస్మాత్తుగా అదృశ్యం అయితే ఏం చేస్తారు..? వారు తిరిగొచ్చే వరకు జీతం రాదు, పోనీ కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుందా అంటే అదీ లేదు. ఉద్యోగి మరణించలేదు కాబట్టి డెత్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కుదరదు. ఇలాంటి సమస్యతో చాలామంది ఇప్పటి వరకూ సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఉగ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వారి దురాగతాలకు బలైపోయి అదృశ్యమైపోయే ఉద్యోగుల సంఖ్య ఎక్కువే. వారి మరణాన్ని ఎవరూ ధృవీకరించలేరు, అలాగని వారి కుటుంబానికి సాయం చేయనూలేరు. కానీ ఇప్పుడీ నిబంధనలకు కాలం చెల్లింది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి కనిపించకుండా పోయినా కుటుంబానికి బెనిఫిట్స్ వర్తింపజేసేలా డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) నిబంధనలు సవరించింది.

ఉద్యోగి కనిపించకుండా పోతే.. ఆ విషయాన్ని వెంటనే ఆయా సంస్థలకు తెలియజేస్తే.. వారి తరపున తర్వాతి నెలనుంచే పింఛన్ వచ్చే ఏర్పాటు చేయబోోతోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఉద్యోగి చనిపోయారనే వార్త ధృవీకరించుకునే వరకు వేచి చూసేవారు. లేదా ఏడేళ్లపాటు ఏ వ్యక్తి అయినా కనిపించకుండా పోతే డెత్ డిక్లరేషన్ సాధ్యమవుతుంది. అలా ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. కానీ ఇప్పుడు ఏడేళ్లపాటు వేచి చూడాల్సిన ఇబ్బంది లేదు.

ఉద్యోగి అదృశ్యమయ్యాడనే వార్త తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులకు పింఛన్ మంజూరు చేస్తారు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఉద్యోగి తిరిగొస్తే, విధుల్లో చేరే అవకాశముంటుంది, అప్పటి వరకు చెల్లించిన పింఛన్ మొత్తాన్ని అతని జీతం నుంచి రికవరీ చేస్తారు. ఈ ఒప్పందం ప్రకారం ఉద్యోగి కుటుంబానికి వెంటనే పింఛన్ చెల్లించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నూతన నిబంధన వల్ల.. సైనికుల కుటుంబాలకే కాదు.. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కూడా పెద్ద ఊరట లభిస్తుందని చెప్పాలి.

ALSO RAED: ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్

First Published:  24 May 2022 1:39 AM GMT
Next Story