Telugu Global
Cinema & Entertainment

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మనం లాంటి బ్లాక్‌బస్టర తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న మరో బ్లాక్‌బస్టర్ చిత్రం థాంక్యూ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5గం.4నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ విషయాన్ని యూనిట్ […]

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

మనం లాంటి బ్లాక్‌బస్టర తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న మరో బ్లాక్‌బస్టర్ చిత్రం థాంక్యూ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5గం.4నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ విషయాన్ని యూనిట్ డిఫరెంట్ గా వెల్లడించింది. నాగచైతన్య సీరియస్ గా డబ్బింగ్ చెబుతుంటే, సీక్రెట్ గా కెమెరాతో విజువల్స్ తీస్తారు. అదేంటని ప్రశ్నిస్తాడు చైతూ. టీజర్ కోసం అంటూ సమాధానమిస్తాడు విక్రమ్ కుమార్. దీంతో నాగచైతన్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ వెంటనే డేట్, టైమ్ ఎనౌన్స్ చేసిన వీడియోను విడుదల చేశారు.

లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై నాగచైతన్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. లవ్ స్టోరీ మేజిక్ ను రిపీట్ చేస్తూనే, మనం కాంబినేషన్ లో మరో హిట్ కొట్టాలనేది చైతూ ఆలోచన.

First Published:  23 May 2022 8:42 AM GMT
Next Story