Telugu Global
Cinema & Entertainment

'సమ్మతమే' నుంచి మరో డిఫరెంట్ సాంగ్

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా “సమ్మతమే“. ఈ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు ఈ హీరో. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన 2 పాటలు కూడా సూపర్‌హిట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుండి […]

Sammathame
X

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా “సమ్మతమే“. ఈ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు ఈ హీరో. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన 2 పాటలు కూడా సూపర్‌హిట్ అయ్యాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మూడో సింగిల్ ‘బావ తాకితే’ అనే పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు. 80ల నాటి రోజుల్ని గుర్తు చేస్తూ, రెట్రో స్టయిల్లో చిత్రీకరించిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరిల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. “చిటపట చినుకులు కురిసెనులే
యదలో అలజడి రేగే..” అంటూ సాగిన సాహిత్యం, విజువల్స్, కాస్ట్యుమ్స్, మ్యూజికల్ బ్యాకింగ్ ఇలా అన్నీ రెట్రో స్టయిల్ ని అందంగా ప్రజంట్ చేశాయి.

సనాపతి భరద్వాజ పాత్రుడు ఈ పాటకు సాహిత్యం అందించగా.. మల్లికార్జున్, మాళవిక శ్రావ్యంగా ఆలపించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర రెట్రో స్టయిల్ లో స్వరపరిచిన ఈ పాట వినడానికి, చూడ్డానికి కూడా బాగుంది.

యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

First Published:  23 May 2022 8:36 AM GMT
Next Story