Telugu Global
NEWS

జెలెన్‌స్కీతో పుతిన్ కూతురు డేటింగ్.. వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా.. సంచలన సీక్రెట్స్ బయటపెట్టిన రష్యా మీడియా..!

రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి ముందు పుతిన్ కుటుంబ వ్యవహారాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. రష్యన్లు కూడా అతడి కుటుంబం, పిల్లల గురించి పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. 70 ఏళ్ల పుతిన్ ఈ ఏజ్‌లో కూడా సీక్రెట్ అఫైర్లు నడుపుతున్నా.. జనాలు ఆసక్తి చూపించలేదు. కానీ ఎప్పుడైతే యుద్దం మొదలైందో పుతిన్ వ్యక్తిగత జీవితంపై యూరోప్, అమెరికన్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ప్రపంచం కూడా ఆసక్తిగా వింటోంది. […]

Putins-daughter-dating-Zhelensky
X

రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి ముందు పుతిన్ కుటుంబ వ్యవహారాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. రష్యన్లు కూడా అతడి కుటుంబం, పిల్లల గురించి పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. 70 ఏళ్ల పుతిన్ ఈ ఏజ్‌లో కూడా సీక్రెట్ అఫైర్లు నడుపుతున్నా.. జనాలు ఆసక్తి చూపించలేదు. కానీ ఎప్పుడైతే యుద్దం మొదలైందో పుతిన్ వ్యక్తిగత జీవితంపై యూరోప్, అమెరికన్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ప్రపంచం కూడా ఆసక్తిగా వింటోంది. ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

పుతిన్ కూతురు కేథరినా టిఖోనోవా.. జెలెన్‌స్కీతో డేటింగ్‌లో ఉందంటూ రష్యాకు చెందిన ఒక ఇండిపెండెంట్ మీడియా కంపెనీ కథనాన్ని వెలువరించింది. అయితే ఈ జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు కాదు. ఆయన జర్మనీకి చెందిన ఒక డ్యాన్సర్. వివరాల్లోకి వెళితే.. పుతిన్ కూతురు కేథరినా టిఖోనోవా ఒక డ్యాన్సర్. ఆమె రష్యాకు చెందిన బిలియనీర్ కిరిల్ శామలోవ్ (40)ను పెళ్లి చేసుకున్నది. అయితే వీళ్లిద్దరూ 2017లో విడిపోయారు.

ఆ తర్వాత కేథరీన్.. జర్మనీలోని మ్యూనిక్‌కు చెందిన బ్యాలే డ్యాన్సర్ ఇగోర్ జెలెన్‌స్కీ (52)తో డేటింగ్ ప్రారంభించింది. 2017-19 మధ్య రెండేళ్లలో ఏకంగా 50 సార్లు ఆమె జర్మనీకి అతడిని కలవడానికి వెళ్లినట్లు మీడియా సంస్థ ‘ఐస్టోరీస్’ ఒక కథనాన్ని వెలువరించింది. అంతే కాకుండా మాస్కో నుంచి జర్మనీకి ఆమె ప్రయాణానికి సంబంధించిన పత్రాలను కూడా బహిర్గత పరిచింది. రెండేళ్ల వయసున్న బిడ్డకు సంబంధించిన పాస్‌పోర్ట్‌ను కూడా విడుదల చేసింది.

కేథరిన్ డేటింగ్ చేస్తున్న జెలెన్‌స్కీ.. ఈ ఏడాది ఏప్రిల్ వరకు బేరిషెస్ స్టాట్స్‌బాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఏప్రిల్ 4న రాజీనామా చేశారు. కేథరిన్-జెలెన్‌స్కీలకు ఒక బిడ్డ కూడా పుట్టినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ పూర్తి వివరాలు మాత్రం అందుబాటులో లేవు. జెలెన్‌స్కీ ప్రస్తుతం రష్యన్ నేషనల్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డులో పని చేస్తున్నారు. ఈ బోర్డు క్రిమియాలో ఒక కల్చరల్ సెంటర్‌ను నిర్మిస్తున్నది. కీలకమైన ఈ పదవిని జెలెన్‌స్కీకి పుతిన్ కట్టబెట్టాడంటే.. వారిద్దరికి చాలా మంచి సంబంధమే ఉందని సదరు మీడియా తెలిపింది.

First Published:  22 May 2022 10:52 PM GMT
Next Story