Telugu Global
NEWS

కొత్తపల్లి ఇక సర్దుకోవాల్సిందేనా?

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి, వైసీపీకి మధ్య సంబంధాలు నానాటికి పూర్తిగా దెబ్బతింటున్నాయి. లేటెస్ట్‌గా ఆయనకున్న గన్‌మెన్లను వెనక్కు పిలిపించారు. టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన సుబ్బారాయుడు 2009లో పీఆర్పీలో చేరి ఓడిపోయారు. 2014కు ముందు ఒకసారి వైసీపీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. వైసీపీ ఓడిపోవడంతో టీడీపీలోకి వెళ్లారు. మరోసారి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఈసారి టికెట్ ఇవ్వలేదు. కొంతకాలంగా సుబ్బారాయుడు వైసీపీ […]

kothapalli-subbarayudu
X

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి, వైసీపీకి మధ్య సంబంధాలు నానాటికి పూర్తిగా దెబ్బతింటున్నాయి. లేటెస్ట్‌గా ఆయనకున్న గన్‌మెన్లను వెనక్కు పిలిపించారు. టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన సుబ్బారాయుడు 2009లో పీఆర్పీలో చేరి ఓడిపోయారు. 2014కు ముందు ఒకసారి వైసీపీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. వైసీపీ ఓడిపోవడంతో టీడీపీలోకి వెళ్లారు. మరోసారి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఈసారి టికెట్ ఇవ్వలేదు.

కొంతకాలంగా సుబ్బారాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నారు. తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న కోపాన్ని ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పరోక్షంగా బయటపెట్టారు. నరసాపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఆయన నిరసన కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా ప్రసాదరాజును గెలిపించి తాను తప్పు చేశానంటూ తన చెప్పుతో తాను కొట్టుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుపై కొత్తపల్లి వ్యాఖ్యలను వైసీపీ నాయకత్వం అప్పట్లోనే సీరియస్‌గా తీసుకుంది. ఇన్‌చార్జ్ మంత్రిగా అప్పట్లో ఉన్న పేర్నినాని కూడా కొత్తపల్లి సుబ్బారాయుడికి పద్దతి మార్చుకోవాలని మీడియా సమావేశంలోనే హెచ్చరించారు.

నిర్ణయం తప్పు అయిన ప్రతిసారి చెప్పుతో కొట్టుకోవాల్సి వస్తే.. పార్టీలు మారిన ప్రతిసారి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవాల్సిందన్నారు. ప్రసాదరాజును రాజకీయంగా అడ్డుతొలగించుకోవాలన్న దురుద్దేశంతోనే సుబ్బారాయుడు ఇలా చేస్తున్నారని అప్పట్లో పేర్నినాని విమర్శించారు.

ఆ తర్వాత సుబ్బారాయుడు సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. లేటెస్ట్‌గా ఆయనకున్న గన్‌మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఆయనకు ఇప్పుడేమీ ముప్పులేదని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు గన్‌మెన్లను ఏలూరు రప్పించారు. పోలీసులు చెబుతున్న కారణాలు ఎలా ఉన్నా.. చెప్పుతో కొట్టుకున్న ఫలితంగానే ఆయనకు గన్‌మెన్లను తొలగించారని అనుచరులు భావిస్తున్నారు. ఇక కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో ఉన్నా లేనట్టేనని.. పార్టీ ఆయన్ను పట్టించుకునే అవకాశం లేదన్న చర్చ జిల్లాలో నడుస్తోంది.

First Published:  22 May 2022 7:31 PM GMT
Next Story