Telugu Global
Cinema & Entertainment

తన రికార్డును తానే క్రాస్ చేసిన మహేష్ బాబు

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమా ‘సర్కారు వారి పాట’. మిక్స్ డ్ టాక్ తో మొదలైంది ఈ సినిమా రన్. అయినప్పటికీ ఓవర్సీస్ లో సక్సెస్ ఫుల్ గా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుకుంది. ఈ క్రమంలో ఓవర్సీస్ లో తన రికార్డ్ ను తానే క్రాస్ చేశాడు మహేష్. ఎట్టకేలకు యూఎస్ లో సరిలేరు నీకెవ్వరు గ్రాస్ కలెక్షన్‌ను క్రాస్ చేయగలిగింది సర్కారువారి పాట. సరిలేరు […]

తన రికార్డును తానే క్రాస్ చేసిన మహేష్ బాబు
X

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమా ‘సర్కారు వారి పాట’. మిక్స్ డ్ టాక్ తో మొదలైంది ఈ సినిమా రన్. అయినప్పటికీ ఓవర్సీస్ లో సక్సెస్ ఫుల్ గా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుకుంది. ఈ క్రమంలో ఓవర్సీస్ లో తన రికార్డ్ ను తానే క్రాస్ చేశాడు మహేష్. ఎట్టకేలకు యూఎస్ లో సరిలేరు నీకెవ్వరు గ్రాస్ కలెక్షన్‌ను క్రాస్ చేయగలిగింది సర్కారువారి పాట.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు 2,288,613 డాలర్లు వచ్చాయి. సర్కారువారి పాట సినిమాకు తాజాగా వచ్చిన 155 లొకేషన్ల నుండి మొత్తంగా 2,291,728 డాలర్ల గ్రాస్ వచ్చింది. అయితే చెప్పుకోడానికి ఈ రికార్డ్ బాగున్నప్పటికీ, సర్కారువారి పాట సినిమాకు ఈ వసూళ్లు సరిపోవు.

ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 400,000 డాలర్లు అవసరం. రెండో వారంలో ఈ సినిమా ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఓవర్సీస్ లో రిపీట్ ఆడియన్స్ తక్కువ. దీంతో సర్కారువారి పాట సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

ఇంతకుముందు మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కంటే సర్కారువారిపాట సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నప్పటికీ.. ఎక్కువ ధరకు సినిమాను అమ్మడం వల్ల నషఅటాలకు దారితీసింది.

First Published:  23 May 2022 1:05 AM GMT
Next Story