Telugu Global
Cinema & Entertainment

లోకేష్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చిన విజయ్

  కోలీవుడ్ లో ప్రస్తుతం హాట్ డైరక్టర్ ఎవరంటే లోకేష్ కనగరాజ్. ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు, కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు చేయబోయే సినిమాపై కోలీవుడ్ లో చాలా చర్చ నడుస్తోంది. ఎట్టకేలకు ఆ చర్చకు తెరపడింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్, మరోసారి విజయ్ తో సినిమా […]

lokesh-vijay-2nd-movie
X

కోలీవుడ్ లో ప్రస్తుతం హాట్ డైరక్టర్ ఎవరంటే లోకేష్ కనగరాజ్. ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు, కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు చేయబోయే సినిమాపై కోలీవుడ్ లో చాలా చర్చ నడుస్తోంది. ఎట్టకేలకు ఆ చర్చకు తెరపడింది.

దర్శకుడు లోకేష్ కనగరాజ్, మరోసారి విజయ్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా అతడే ప్రకటించాడు. తను చెప్పిన స్టోరీ విజయ్ కు నచ్చిందని, మరోసారి తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో మాస్టర్ సినిమా వచ్చింది. ఆ సినిమాను తలదన్నే రేంజ్ లో విజయ్ తో నెక్ట్స్ సినిమా ఉంటుందంటున్నాడు ఈ డైరక్టర్.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా పనిలో బిజీగా ఉన్నాడు విజయ్. రష్మిక హీరోయిన్ గా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ దర్శకత్వంలో మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు విజయ్. ఈ గ్యాప్ లో కమల్ తో చేస్తున్న విక్రమ్ సినిమా పనులు పూర్తి చేయబోతున్నాడు లోకేష్.

First Published:  22 May 2022 10:00 PM GMT
Next Story