Telugu Global
Cinema & Entertainment

ఖుషి మూవీ షూటింగ్ అప్ డేట్స్

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ “ఖుషి”. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. గత నెల 23వ తేదీ నుంచి కశ్మీర్ లో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టారు. అక్కడి […]

kushi
X

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ “ఖుషి”. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.

గత నెల 23వ తేదీ నుంచి కశ్మీర్ లో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టారు. అక్కడి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం గ్రూప్ ఫొటో దిగారు. “కశ్మీర్ షెడ్యూల్ మంచి ఫీల్ ఇచ్చింది. విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ కంగ్రాంట్స్” అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

సినిమాకు సంబంధించి నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అలెప్పి లో మిగతా షూటింగ్ చేస్తారు. ఇటీవలే విడుదల చేసిన “ఖుషి” టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

First Published:  23 May 2022 8:39 AM GMT
Next Story