Telugu Global
International

కరోనా ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ ను సృష్టించింది

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మరిచిపోలేం. అయితే అనారోగ్యాలు, మరణాలే కాదు లక్షలాది మందిని పేదరికంలోకి తోసింది. వందల మందిని బిలయనీర్లను చేసింది. ఆక్స్‌ఫామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ చేసిన నూతన‌ స‌ర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి 30 గంట‌ల‌కు ఒక కొత్త బిలియ‌నీర్ పుట్టుకవ‌చ్చిన‌ట్లు ఆక్స్‌ఫామ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ కాలంలో 573 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారని నివేదిక తెలిపింది.అలాగే […]

కరోనా ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ ను సృష్టించింది
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మరిచిపోలేం. అయితే అనారోగ్యాలు, మరణాలే కాదు లక్షలాది మందిని పేదరికంలోకి తోసింది. వందల మందిని బిలయనీర్లను చేసింది.

ఆక్స్‌ఫామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ చేసిన నూతన‌ స‌ర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి 30 గంట‌ల‌కు ఒక కొత్త బిలియ‌నీర్ పుట్టుకవ‌చ్చిన‌ట్లు ఆక్స్‌ఫామ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ కాలంలో 573 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారని నివేదిక తెలిపింది.అలాగే ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది కడు పేదరికంలోకి నెట్టబడ్డట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సమావేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు, అత్యంత‌ శక్తివంతులు దావోస్ లో సమావేశమవుతుండగా ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది.

‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ అనే పేరుతో ఈ నివేదికను దావోస్‌లో విడుదల చేసిన ఆక్స్‌ఫామ్, నిత్యావసర వస్తువుల ధరలు దశాబ్దాల కంటే వేగంగా పెరగడంతో, ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు ప్రతి రెండు రోజులకు 1 బిలియన్ డాలర్లు తమ సంపదను పెంచుకుంటున్నారని పేర్కొంది.

“బిలియనీర్లు తమ సంపద మరింత పెరుగుదల ప్రణాళికల కోసం దావోస్‌కు చేరుకున్నారు. మొన్నటి వరకు కరోనా మహమ్మారి, ఇప్పుడు ఆహారం, ఇంధన ధరలు బాగా పెరగడం వారికి బొనాంజాగా మారాయి. మరో వైపు ద‌శాబ్ధాలుగా పేదరిక నిర్మూల‌న కోసం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌న్నీ ఇప్పుడు రివ‌ర్స్‌లో వెళ్తున్నాయి. అత్య‌ధిక స్థాయిలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగాయి.ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు తమ రోజువారి జీవితం సాగించేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు” అని ఈ రిపోర్ట్ ను విడుదల చేసిన ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ గ్యాబ్రియేలా బుచర్ అన్నారు.

కోవిడ్-19 యొక్క మొదటి 24 నెలల్లో బిలియనీర్ల సంపద 23 సంవత్సరాలలో కలిపిన దానికంటే ఎక్కువగా పెరిగింది. ప్రపంచంలోని బిలియనీర్ల మొత్తం సంపద ఇప్పుడు ప్రపంచ GDPలో 13.9%కి సమానం, 2000లో 4.4% ఉండగా అది ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. అని నివేదిక పేర్కొంది.

“కార్మికులు తక్కువ జీతానికి అధ్వాన్నమైన పరిస్థితులలో కష్టపడి పనిచేస్తున్నారు. మహా సంపన్నులు దశాబ్దాలుగా ఎలాంటి శిక్షలు లేకుండా వ్యవస్థను మోసగిస్తున్నారు. ఆ మహా సంపన్నులంతా ప్రైవేటీకరణ ఫలితంగా ప్రపంచ సంపదలో అతి ఎక్కువ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాల సహకారంతో, గుత్తాధిపత్యంతో, నియంత్రణలతో, కార్మికుల హక్కులను కాలరాయడం వల్ల ఈ సంపదను వాళ్ళు సంపాదించారు. ” అని బుచర్ అన్నారు.

“మరో వైపు మిలియన్ల మంది ఆకలితో ఉన్నారు. మనుగడ కోసం ఏమి చేయాలో అర్దం కాకుండా ఉన్నారు. తూర్పు ఆఫ్రికాలో, ప్రతి నిమిషానికి ఒకరు ఆకలితో చనిపోతున్నారు. ఈ వింతైన అసమానత మానవులుగా మనల్ని కలిపి ఉంచే బంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఇది ప్రమాదకరమైనది. ఇది అక్షరాలా హత్యలతో సమానమైన‌ అసమానత.” అని బుచర్ ఆవేదన వ్య‌క్తం చేశారు.

కరోనా మహమ్మారి 40 మంది కొత్త ఫార్మా బిలియనీర్‌లను సృష్టించిందని, కోవిడ్-19 వ్యాక్సిన్‌పై తమ గుత్తాధిపత్య నియంత్రణ ద్వారా మోడర్నా, ఫైజర్ వంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ప్రతి సెకనుకు 1,000 డాలర్ల లాభాన్ని ఆర్జిస్తున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది.

First Published:  23 May 2022 6:12 AM GMT
Next Story