Telugu Global
NEWS

శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పు..?

తెలుగు రాష్ట్రాలకు ప్రధాన విమానాశ్రయం గా హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) పేరు మార్చారా..? విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను 30 ఏళ్లు పొడిగిస్తూ ఇటీవల GMR గ్రూప్ కి అనుమతి ఇచ్చిన కేంద్రం.. పేరు మార్చుకోమని కూడా పర్మిషన్ ఇచ్చిందా..? అసలు ఏంటి ఈ వివాదం. కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు కేంద్రం ఎందుకు సమాధానం చెప్పడంలేదు..? హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2008 మార్చి 23 న ప్రారంభించారు. విస్తీర్ణం […]

శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పు..?
X

తెలుగు రాష్ట్రాలకు ప్రధాన విమానాశ్రయం గా హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) పేరు మార్చారా..? విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను 30 ఏళ్లు పొడిగిస్తూ ఇటీవల GMR గ్రూప్ కి అనుమతి ఇచ్చిన కేంద్రం.. పేరు మార్చుకోమని కూడా పర్మిషన్ ఇచ్చిందా..? అసలు ఏంటి ఈ వివాదం. కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు కేంద్రం ఎందుకు సమాధానం చెప్పడంలేదు..?

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2008 మార్చి 23 న ప్రారంభించారు. విస్తీర్ణం పరంగా ఇది భారత్ లోనే అతి పెద్ద విమానాశ్రయం. అంతేకాదు, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇది నాలుగోది. విమానాశ్రయ నిర్వహణ GMR సంస్థ పరిధిలో ఉంది. విమానాశ్రయ ఏర్పాటు నుంచి 30ఏళ్ల వరకు మొదట ఆ సంస్థకే దీని నిర్వహణ అనుమతి ఇచ్చారు. ఇటీవలే దాన్ని మరో 30ఏళ్లు పొడిగించారు. అంటే 2038 వరకు ఉన్న అనుమతి ఇప్పుడు 2068 వరకు పొడిగించారన్నమాట. అయితే ఈ పొడిగింపుతోపాటు.. పేరు మార్పు వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. నిర్వహణ అనుమతి 30 ఏళ్లు పొడిగించిన తర్వాత రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కాస్తా GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (GHIAL) మార్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ వెబ్ సైట్ లో పేరు మార్చారని దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.

తెలంగాణ సీఎం కేసీఆర్ కి శ్రవణ్ ఓ లేఖ రాశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు తొలగింపుతో కేంద్రం కక్షపూరిత చర్యలకు సిద్ధపడిందని, వెంటనే పాత పేరు పునరుద్ధరించాలని ఆయన కేసీఆర్ ని కోరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు.

అధికారిక ప్రకటన ఏదీ లేకుండానే రాజీవ్ గాంధీ పేరు తొలగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అకౌంట్లలో రాజీవ్ గాంధీ పేరు తొలగించకపోయినా.. ఎయిర్ పోర్ట్ లోగోలో మాత్రం పేరు మార్చేశారు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అనే అక్షరాలే హైలెట్ అయ్యేలా వెబ్ సైట్ లో ఉంచారు. దీంతో కాంగ్రెస్ నేతలు కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటీవల దివంగత నేత రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు మోదీ. సద్భావనా దివస్ సందేశం కూడా వినిపించారు. అదే సమయంలో ఆయన పేరుని ఎందుకు అవమానించారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  23 May 2022 4:52 AM GMT
Next Story