Telugu Global
NEWS

మా రోడ్లపై తిరుగుతున్నారు.. కనీసం మోదీ ఫొటో అయినా పెట్టండి..

ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో క్రెడిట్ అంతా తమదేనంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. పథకాలు మావి, లబ్ధిదారులు ఏపీ ప్రజలు, ఆ క్రెడిట్ కొట్టేస్తోంది మాత్రం ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. అంటూ నిష్టూరపోయారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అసలు వైసీపీ నేతలంతా.. కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లపై ప్రయాణం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అని, ఈ విషయంపై దమ్ముంటే చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన […]

మా రోడ్లపై తిరుగుతున్నారు.. కనీసం మోదీ ఫొటో అయినా పెట్టండి..
X

ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో క్రెడిట్ అంతా తమదేనంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. పథకాలు మావి, లబ్ధిదారులు ఏపీ ప్రజలు, ఆ క్రెడిట్ కొట్టేస్తోంది మాత్రం ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. అంటూ నిష్టూరపోయారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అసలు వైసీపీ నేతలంతా.. కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లపై ప్రయాణం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అని, ఈ విషయంపై దమ్ముంటే చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు.

మోదీ ఫొటో అయినా పెట్టండి..
ఏపీలో పేదలకు పంచే రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం రెండు రూపాయలేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 రూపాయలు సబ్సిడీ ఇస్తోందని అన్నారు సోము వీర్రాజు. రెండు రూపాయల వాటా పెట్టిన రాష్ట్రం.. వాహనాలు తిప్పుతూ దానిపై జగన్ బొమ్మ వేసుకుంటోందని మండిపడ్డారు. మోదీ బొమ్మ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, అందుకే న్యాయపరంగా తమకు రావాల్సిన క్రెడిట్ తమకు ఇవ్వాలని, పథకాలపై మోదీ బొమ్మ పెట్టాలని అన్నారాయన.

రేట్లు తగ్గించండి..
కేంద్రం తనవంతుగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించిందని, రాష్ట్రం కూడా స్థానిక పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ట్యాక్స్ లు తగ్గించారని, కానీ ఏపీలో అలాంటి ఊసే లేదని మండిపడ్డారు. రేట్లు పెరుగుతున్నంతకాలం.. విమర్శలు వినిపిస్తే సైలెంట్ గా ఉన్న బీజేపీ నేతలు.. ఇప్పుడు రేట్లు తగ్గేసరికి తమ జాలిగుండె చూడండి అంటున్నారు. పేదలపై భారం పడకుండా లక్షకోట్ల భారం మోస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ బాసటగా ఉండాలంటున్నారు. అయితే పెట్రోల్ రేట్లు తగ్గించినా బీజేపీపై ఎక్కడా సింపతీ పెరగలేదని తెలుస్తోంది. ఇన్నాళ్లూ రేట్లు పెంచి అన్యాయంగా పీల్చి పిప్పిచేశారనే ఉద్దేశంలోనే దేశ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు రేట్లు తగ్గించినా.. బీజేపీ వ్యూహం ఏంటో తమకి తెలుసంటున్నారు.

First Published:  23 May 2022 5:22 AM GMT
Next Story