Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలోకి అడుగుపెడుతున్న మరో హీరో

తెలుగు నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఆది సాయికుమార్ చేరాడు. తాజాగా తన దగ్గరకొచ్చిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఆది సాయికుమార్. ఆ కథేంటి.. ఏ ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయాన్ని ఆది సాయికుమార్ చెప్పలేదు. త్వరలోనే ఆ డీటెయిల్స్ అన్నీ వెల్లడిస్తానని ప్రకటించాడు. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కింది బ్లాక్ సినిమా. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన ఆది సాయికుమార్, ఇలా […]

ఓటీటీలోకి అడుగుపెడుతున్న మరో హీరో
X

తెలుగు నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఆది సాయికుమార్ చేరాడు. తాజాగా తన దగ్గరకొచ్చిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఆది సాయికుమార్. ఆ కథేంటి.. ఏ ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయాన్ని ఆది సాయికుమార్ చెప్పలేదు. త్వరలోనే ఆ డీటెయిల్స్ అన్నీ వెల్లడిస్తానని ప్రకటించాడు.

ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కింది బ్లాక్ సినిమా. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన ఆది సాయికుమార్, ఇలా తన ఓటీటీ డెబ్యూను బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో కెరీర్ డౌన్ ట్రెండ్ లో నడుస్తోంది. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. అందుకే ఇలా ఓటీటీ వైపు అడుగులు వేశాడు.

సక్సెస్ ఉన్నా, ఫెయిల్యూర్ ఉన్నా, ఓటీటీలో అడుగుపెట్టడం ఇప్పుడు అనివార్యమైంది. అందుకే వెంకటేష్, నాగచైతన్య, రానా లాంటి వాళ్లు ఇప్పటికే ఓటీటీ దిశగా అడుగులు వేశారు. ఇక హీరోయిన్ల సంగతి సరేసరి. ఆది సాయికుమార్ లాంటోళ్లకైతే ఇప్పుడు ఓటీటీ తప్పనిసరిగా మారింది.

ఎందుకంటే, ఆదికి థియేట్రికల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అతడి సినిమాలకు ఓపెనింగ్ రోజు 15 లక్షలు కూడా రావడం కష్టంగా మారింది. అందుకే ఇలా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాడు.

First Published:  23 May 2022 1:15 AM GMT
Next Story