Telugu Global
NEWS

మమ్మల్ని అడిగి ధరలు పెంచారా? కేంద్రంపై తమిళనాడు ఆర్థికమంత్రి ఫైర్

తాజాగా కేంద్రప్రభుత్వం ఇంధనం ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గించింది.. దీంతో పెట్రోల్ ధర 9.50, డీజిల్ ధర రూ. 7 తగ్గింది. ఇదిలా ఉంటే దీన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమది ప్రజల ప్రభుత్వమని అనేదాకా వెళ్లారు. రాష్ట్రాలు కూడా ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తే ధరలు దిగొస్తాయని హితబోధ చేస్తున్నారు. కాగా బీజేపీ నేతల సూచనపై తమిళనాడు […]

మమ్మల్ని అడిగి ధరలు పెంచారా?  కేంద్రంపై తమిళనాడు ఆర్థికమంత్రి ఫైర్
X

తాజాగా కేంద్రప్రభుత్వం ఇంధనం ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గించింది.. దీంతో పెట్రోల్ ధర 9.50, డీజిల్ ధర రూ. 7 తగ్గింది. ఇదిలా ఉంటే దీన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమది ప్రజల ప్రభుత్వమని అనేదాకా వెళ్లారు. రాష్ట్రాలు కూడా ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తే ధరలు దిగొస్తాయని హితబోధ చేస్తున్నారు.

కాగా బీజేపీ నేతల సూచనపై తమిళనాడు ఆర్థికశాఖమంత్రి త్యాగరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచినప్పుడు రాష్ట్రాలను సంప్రదించిందా? ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోయింది. వారి విధానాల వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వారికి తెలిసింది. అందుకే దిగొచ్చారు.

ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలని సూచించడం ఏమిటి? 2021 తర్వాత పెట్రోల్ పై రూ. 23, డీజిల్ పై 29 పెంచారు. సామాన్యుడిపై పెనుభారం మోపారు. ఇప్పుడు 8 రూపాయలు తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు. బీజేపీ నేతలకు, కేంద్ర ప్రభుత్వానికి సమాఖ్య స్ఫూర్తి అంటే ఏమిటో తెలుసా? రాష్ట్రాలతో ఎలా వ్యవహరించాలో తెలుసా?’ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు త్యాగరాజన్. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

First Published:  22 May 2022 7:14 AM GMT
Next Story