Telugu Global
National

SBI వినియోగదారులకు హెచ్చరిక !

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లా? అయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. మీరు SBI కస్టమర్ అయితే, మీ SBI ఖాతాను బ్లాక్ చేశారని చెబుతూ ఓ ఫేక్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఇటువంటి నకిలీ SBI SMS లు వినియోగదారులకు పెద్ద ముప్పును కలిగిజేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. అటువంటి ఈ మెయిల్లు, SMS లకు ప్రతిస్పందించవద్దని SBI కస్టమర్లందరినీ హెచ్చరించారు. ఎవ్వరు అడిగినప్పటికీ కస్టమర్లు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని […]

SBI
X

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లా? అయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. మీరు SBI కస్టమర్ అయితే, మీ SBI ఖాతాను బ్లాక్ చేశారని చెబుతూ ఓ ఫేక్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది.
ఇటువంటి నకిలీ SBI SMS లు వినియోగదారులకు పెద్ద ముప్పును కలిగిజేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. అటువంటి ఈ మెయిల్లు, SMS లకు ప్రతిస్పందించవద్దని SBI కస్టమర్లందరినీ హెచ్చరించారు. ఎవ్వరు అడిగినప్పటికీ కస్టమర్లు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని ప్రభుత్వం తెలిపింది.

అలాగే, SBI ఖాతాదారులకు అలాంటి SMS, ఈ మెయిల్ లు వస్తే, వెంటనే report.phishing@sbi.co.inకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. SBI కస్టమర్‌లకు ఎటువంటి ఫేక్ మెసేజ్ లు పంపబడుతున్నాయో కూడా ప్రభుత్వం తన ప్రకటన‌లో పేర్కొంది. ”మీ SBI బ్యాంక్ పత్రాల గడువు ముగిసింది”. ”మీ ఖాతా 24 గంటల్లో బ్లాక్ చేయబడుతుంది.” ”KYCని అప్‌డేట్ చేయండి, దాని కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.” అని మెసేజ్ లు వస్తున్నాయి. అయితే ఏదైనా SMSలోని లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా KYCని పూర్తి చేయమని బ్యాంక్ తన కస్టమర్‌లను ఎప్పుడూ అడగదని, అందుకే #YehWrongNumberHai అని SBI తెలిపింది.

వినియోగదారులు సురక్షితంగా ఉండాలంటే…. మీకు వచ్చిన‌ మెసేజ్ లో ఏదైనా లింక్ కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని లింక్‌పై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. బ్యాంకు, ఏదైనా ఆర్థిక సంస్థ మిమ్మల్ని అలా చేయమని అడగదు. లింక్‌ని జాగ్రత్తగా తనిఖీ చేయండి. అలాంటి లింకుల‌ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుంది. మీ ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేయబడుతుంది. అందువల్ల‌ పొరపాటున కూడా అలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు.

ALSO READ: కేజ్రీవాల్ తో కేసీఆర్ కీలక సమావేశం

First Published:  22 May 2022 5:09 AM GMT
Next Story