Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ కొత్త సినిమా సంగతులు

ఎఫ్3 సినిమాలో ఫుల్ కామెడీ చేశాడు వరుణ్ తేజ్. సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకు నత్తి ఉంటుంది. దాన్ని కవర్ చేయడం కోసం అందరు హీరోల స్టెప్పుల్ని వేస్తుంటాడు. ఇలా మూవీలో అల్టిమేట్ కామెడీ పండించాడు. అలా ఇన్నాళ్లూ సరదాగా గడిపేసిన ఈ హీరో, ఇప్పుడు సీరియస్ మోడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ […]

varun tej
X

ఎఫ్3 సినిమాలో ఫుల్ కామెడీ చేశాడు వరుణ్ తేజ్. సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకు నత్తి ఉంటుంది. దాన్ని కవర్ చేయడం కోసం అందరు హీరోల స్టెప్పుల్ని వేస్తుంటాడు. ఇలా మూవీలో అల్టిమేట్ కామెడీ పండించాడు. అలా ఇన్నాళ్లూ సరదాగా గడిపేసిన ఈ హీరో, ఇప్పుడు సీరియస్ మోడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాపై ప్రస్తుతం దృష్టి పెట్టాడు వరుణ్. దీని కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నాడు. జూన్ చివరి వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

ప్రస్తుతం నాగార్జునతో ది ఘోస్ట్ అనే సినిమా చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. ఆ సినిమా షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ వెంటనే వరుణ్ తేజ్ తో కలిసి మరో యాక్షన్ మూవీ ప్లాన్ చేశాడు ఈ డైరక్టర్. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనిలోనే వరుణ్ తేజ్ ఉన్నాడు.

ఎఫ్3 మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఎందుకంటే, రీసెంట్ గా అతడు నటించిన గని సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఈ మూవీ ఫెయిల్యూర్ పై ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు హీరో. ఆ దెబ్బ నుంచి కోలుకోవాలంటే ఎఫ్3 సక్సెస్ వరుణ్ కు చాలా అవసరం.

First Published:  22 May 2022 7:28 AM GMT
Next Story