Telugu Global
NEWS

స్పీకర్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బోస్టన్‌లో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ మహానాడులో ప్రసంగించిన బుచ్చయ్య చౌదరి… 40ఏళ్లలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ నోర్లు మూయించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ” స్పీకర్‌ వాడో మూర్ఖుడు.. జగన్‌మోహన్ రెడ్డిని చూసి బట్టలు తడుపుకుంటాడు. చంద్రబాబుకు గానీ, మాకు గానీ మైక్ ఇవ్వడు” అంటూ బుచ్చయ్య మాట్లాడారు. అసెంబ్లీలో తమ […]

Butchaiah Chowdary
X

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బోస్టన్‌లో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ మహానాడులో ప్రసంగించిన బుచ్చయ్య చౌదరి… 40ఏళ్లలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ నోర్లు మూయించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ” స్పీకర్‌ వాడో మూర్ఖుడు.. జగన్‌మోహన్ రెడ్డిని చూసి బట్టలు తడుపుకుంటాడు. చంద్రబాబుకు గానీ, మాకు గానీ మైక్ ఇవ్వడు” అంటూ బుచ్చయ్య మాట్లాడారు.

అసెంబ్లీలో తమ ముఖాలు కూడా టీవీల్లో కనిపించకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ ప్రసారాలను సాక్షి లేదా ఆయన పెట్టుబడిదారుల టీవీ9 మాత్రమే చూపించాలి, టీవీ5 గానీ, ఏబీఎన్‌ గానీ చూపించడానికి వీల్లేదన్నట్టుగా నియంత్రిస్తున్నారని బుచ్చయ్య ఆరోపించారు. గుడివాడ వెధవ, అంబటి రాంబాబు, రోజా లాంటి అంబోతులు ఇష్టానుసారం మాట్లాడుతున్నాయని వ్యాఖ్యలు చేశారు.

ఒకరోజు అసెంబ్లీలో తనను కూడా టార్గెట్ చేశారని, మైక్ ఇవ్వకుండా ఇష్టానుసారం మాట్లాడుతుంటే… అసెంబ్లీ మధ్యలోకి వెళ్లి మైక్ ఇవ్వు జగన్‌మోహన్ రెడ్డి నీ సంగతి తేలుస్తా అంటూ బాలకృష్ణలాగా తోడ కొట్టి సవాల్ చేశానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పుకున్నారు. మామూలు రేజర్‌ అయితే సింగిల్ బ్లేడ్ మాత్రమే ఉంటుంది, సరిగా తెగదు.. కావాలంటే ఫ్లోరెక్‌ బ్లేడ్‌ తెచ్చుకోని, నా ఒంటిపై ఏమైనా ఉంటే గోక్కోండి అని సవాల్ చేశానని కూడా చెప్పారు బుచ్చయ్యచౌదరి.

ALSO READ: పంచాయతీలకే నిధులు సరిపోవట్లేదు.. ఇప్పుడు ఎంపీడీవో వాహనాల మెయింటెనెన్స్ ఖర్చుల భారం..!

First Published:  21 May 2022 11:16 PM GMT
Next Story