Telugu Global
National

రైతులను నాశనం చేయాలని కేంద్రం చూస్తోంది " పంజాబ్ లో కేసీఆర్ ఆగ్రహ‍ం

దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా మేము కాపాడుతూ ఉంటే మోడీకి గిట్టడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. తాము ఉచిత కరెంట్ ఇస్తూ ఉంటే కరెంటు బిల్లులు వేయండి, మీటర్లు పెట్టండి అని కేంద్రం అడుగుతోందని తాము చనిపోవడానికైనా సిద్దమే కానీ మీటర్లు మాత్రం పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ లోయలో అమరులయిన జవాన్ల కుటుంబాలను కేసీఆర్ పరమార్శించారు. ఈ సందర్భంగా చండీగ‌ఢ్‌లోని […]

రైతులను నాశనం చేయాలని కేంద్రం చూస్తోంది  పంజాబ్ లో కేసీఆర్ ఆగ్రహ‍ం
X

దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా మేము కాపాడుతూ ఉంటే మోడీకి గిట్టడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. తాము ఉచిత కరెంట్ ఇస్తూ ఉంటే కరెంటు బిల్లులు వేయండి, మీటర్లు పెట్టండి అని కేంద్రం అడుగుతోందని తాము చనిపోవడానికైనా సిద్దమే కానీ మీటర్లు మాత్రం పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ లోయలో అమరులయిన జవాన్ల కుటుంబాలను కేసీఆర్ పరమార్శించారు. ఈ సందర్భంగా చండీగ‌ఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఆయనతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్.. అమరులైన 600 మంది రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్థిక స‌హాయం అందించారు.

ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ… ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా మన దేశంలో ఇలాంటి సమావేశాలు జరపాల్సి రావడం సిగ్గు పడాల్సిన విషయమన్నారు. ఈ దేశంలో ఇలా ఎందుకు జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చలు జరపాలి. ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలి. సమస్యలు లేని దేశముంటుందని నేను అనను కానీ మన లాంటి సమస్యలున్న దేశాలు మాత్రం ప్రపంచలో లేవు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పంజాబ్ ఈ దేశానికి భగత్ సింగ్ వంటి వీరులను అందించింది. ఈ దేశానికి అన్నం పెట్టింది. ఈ దేశ వ్యవసాయాన్ని కాపాడటం కోసం పంజాబ్ రైతులు, దేశ సరిహద్దులు కాపాడటానికి పంజాబ్ సైనికులు ప్రాణాలిచ్చారు అని కేసీఆర్ అన్నారు.

కేంద్రం తీసుకవచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై ఖాలిస్తాన్ తీవ్రవాదులంటూ బీజేపీ ప్రభుత్వ‍ ముద్రలు వేసింది. అనేక మంది మరణాలకు కారణమయ్యింది. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులు మాత్రం గుండె ధైర్యంతో సంవత్సర కాలం పోరాడి సాగుచట్టాలు రద్దు చేయించగలిగారు అని కేసీఆర్ ప్రశంసించారు. తాము మొదటి నుండి రైతులకు, రైతు ఉద్యమాలకు అండగా ఉన్నామని, ఇకపైన కూడా ఉంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వాలను మార్చగలిగే సత్తా రైతులకే ఉందని చెప్పిన కేసీఆర్ రైతు పంటలకు కనీస మద్దతు ధర కల్పించే వారికే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

First Published:  22 May 2022 8:23 AM GMT
Next Story