Telugu Global
NEWS

జగన్‌ విమానం లండన్‌లో దిగడం వెనుక ఇదీ కారణం..

దావోసు పర్యటనకు ప్రత్యేక విమానంలో వెళ్లిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్కడ కాకుండా లండన్‌లో ల్యాండ్‌ అవడంపై ఒక వర్గం మీడియా కథనాలు ప్రసారం చేసింది. దావోసు వెళ్లాలంటే లండన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకున్నా ఎందుకెళ్లారని ఆ మీడియా ప్రశ్నించింది. అది కూడా దావోసు పర్యటనకు అని కోర్టు నుంచి అనుమతులు తీసుకుని లండన్ వెళ్లారని, ఈ యాత్ర పెట్టుబడుల కోసమా లేక విహార యాత్రనా అంటూ కథనాలు ప్రసారం చేసింది. టీడీపీ కూడా […]

జగన్‌ విమానం లండన్‌లో దిగడం వెనుక ఇదీ కారణం..
X

దావోసు పర్యటనకు ప్రత్యేక విమానంలో వెళ్లిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్కడ కాకుండా లండన్‌లో ల్యాండ్‌ అవడంపై ఒక వర్గం మీడియా కథనాలు ప్రసారం చేసింది. దావోసు వెళ్లాలంటే లండన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకున్నా ఎందుకెళ్లారని ఆ మీడియా ప్రశ్నించింది. అది కూడా దావోసు పర్యటనకు అని కోర్టు నుంచి అనుమతులు తీసుకుని లండన్ వెళ్లారని, ఈ యాత్ర పెట్టుబడుల కోసమా లేక విహార యాత్రనా అంటూ కథనాలు ప్రసారం చేసింది.

టీడీపీ కూడా జగన్‌పై దాడి మొదలుపెట్టింది. పెట్టుబడుల కోసం సీఎం ప్రత్యేక విమానంతో వెళ్లేటప్పుడు ఉన్నతాధికారులు, మంత్రులు కూడా సహజంగా అదే విమానంలో వెళ్తుంటారని.. కానీ జగన్ వెళ్లిన విమానంలో సీఎం, సీఎం భార్య వైఎస్‌ భారతి, ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి మాత్రమే ఉన్నారని.. దీన్ని బట్టి లండన్‌కు ముందస్తు ఆలోచనతోనే సీఎం సతీసమేతంగా వెళ్లారని టీడీపీ విమర్శలు చేస్తోంది.

ఈ విమర్శలు, కథనాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. సీఎం పర్యటనపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. జగన్‌ పర్యటనలో రహస్యమేమీ లేదని బుగ్గన వ్యాఖ్యానించారు. సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని చెప్పారు. ఎయిర్‌ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఇంధనం నింపే ప్రక్రియ ఆలస్యం అయిందన్నారు. లండన్ వెళ్లి అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ విమానాశ్రయానికి వెళ్లేందుకు సిద్ధమవగా.. జురెక్‌ ఎయిర్‌పోర్టులో రాత్రి 10 తర్వాత విమానాల ల్యాండింగ్‌కు చాలా సంవత్సరాలుగా అవకాశం లేదని అధికారులు తెలిపారన్నారు.

దాంతో లండన్‌లోనే సీఎం జగన్‌ బస ఏర్పాటు చేయాల్సి వచ్చిందని బుగ్గన వివరించారు. తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు సీఎం సిద్ధమైనప్పటికీ.. పైలట్లు నిన్న అంతా ప్రయాణం చేసినందున డీజీసీఏ నిబంధనల ప్రకారం వారు నిర్ణీత గంటలు పాటు విశ్రాంతిని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దాంతో పర్యటన ఆలస్యంగా సాగిందన్నారు.

అయితే ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రానికి వైఎస్‌ జగన్‌ స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో మంత్రులు, అక్కడి తెలుగువారు సీఎంకు స్వాగతం పలికారు.

First Published:  21 May 2022 8:37 AM GMT
Next Story