Telugu Global
Family

బ్రేక్‌ఫాస్ట్‌ ఎలా చేయాలో తెలుసా?

ఉదయం తీసుకునే ఆహారమే రోజు మొత్తంలో ముఖ్యమైన ఆహారం. బరువు తగ్గాలన్నా, మెటబాలిజం పెరగాలన్నా.. బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా తీసుకోవడం చాలా అవసరం. కానీ చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఎంతో ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్ విషయంలోనే చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్ టైంలో శక్తినివ్వని జంక్ ఫుడ్స్ తింటుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అంటే లైట్‌గా ఉండాలని తక్కువ మొత్తంలో తింటుంటారు.

బ్రేక్‌ఫాస్ట్‌ ఎలా చేయాలో తెలుసా?
X

ఉదయం తీసుకునే ఆహారమే రోజు మొత్తంలో ముఖ్యమైన ఆహారం. బరువు తగ్గాలన్నా, మెటబాలిజం పెరగాలన్నా.. బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా తీసుకోవడం చాలా అవసరం. కానీ చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు.

ఎంతో ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్ విషయంలోనే చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్ టైంలో శక్తినివ్వని జంక్ ఫుడ్స్ తింటుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అంటే లైట్‌గా ఉండాలని తక్కువ మొత్తంలో తింటుంటారు. దీని వల్ల శరీరం చాలా నష్టపోతుంది. అసలు బ్రేక్‌ఫాస్ట్‌లో తినాల్సిన, తినకూడని ఆహారాలేంటోఇప్పుడు తెలుసుకుందాం.

బ్రేక్‌ఫాస్ట్ అనగానే చాలామందికి బ్రెడ్ గుర్తొస్తుంది. బ్రెడ్ అండ్ బటర్, బ్రెడ్ అండ్ జామ్, బ్రెడ్ ఆమ్లెట్, శాండ్‌విచ్ లాంటివి ఉదయాన్నే తింటుంటారు. వీటి వల్ల శరీరానికి తగిన శక్తి అందకపోగా లేనిపోని సమస్యలొచ్చే అవకాశం ఉంది. బ్రెడ్ ఎక్కువగా తినడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం కూడా ఉంది.

బ్రేక్​ఫాస్ట్​లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్.. ఈ మూడు ఉండేలా చూసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్.. ఒక కంప్లీట్ మీల్‌లా ఉండాలి. ఇందులో హెల్దీ ప్రోటీన్స్ కోసం స్ప్రౌట్స్, గుడ్లు, స్మోక్డ్ నట్స్,​ పెసరట్టు, పెరుగన్నం, పనీర్​ లాంటివి తీసుకోవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్ కోసం ఓట్స్​, ఉప్మా, పోహ, ఇడ్లీ, దోశ, చపాతి లాంటివి తినొచ్చు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఉన్నవి ఎంచుకుంటే ఇంకా మంచిది. ఇకపోతే బ్రేక్‌ఫాస్ట్‌లో లైట్‌గా ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. అన్​శాచ్యురేటెడ్​ ఫ్యాట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉండే అవిసె గింజలు, వాల్ నట్స్ లాంటివి తీసుకోవచ్చు.

బ్రేక్​ఫాస్ట్​తో పాటే కాఫీ, టీలు కూడా తాగుతుంటారు చాలామంది. అయితే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు గ్రీన్ టీ అలాగే బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక కప్పు టీ తాగడం వరకూ ఓకే. కానీ, అంతకు మించి కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువమొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఫ్రూట్స్‌ను ఎంచుకున్నట్టయితే ప్రొటీన్స్ కోసం నట్స్ లాంటివి కూడా కలిపి తీసుకోవాలి.

ఇకపోతే డైట్ పేరుతో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బరువు మరింత పెరిగే అవకాశముంది. ఉదయాన్నే తీసుకునే ఆహారం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువ. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. బ్రేక్ ఫాస్ట్ ను లేచిన గంటన్నర లోపు తినేయాలి. వాస్తవానికి బ్రేక్‌ఫాస్ట్‌ను ఫుల్ మీల్ లాగా, లంచ్‌ను లైట్ మీల్ లాగా.. డిన్నర్‌ను స్నాక్స్ లాగా ప్లాన్ చేసుకుంటే బరువు తగ్గడం సులభమవుతుంది.

First Published:  20 May 2022 8:55 PM GMT
Next Story