Telugu Global
National

జ్ఞానవాపి శివలింగం పై ఫేస్ బుక్ పోస్ట్ " ప్రొఫెసర్ అరెస్ట్

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో దొరికిన ‘శివలింగం’ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేశాడంటూ ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్‌ను గత రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. హిందూ కాలేజీలో పనిచేస్తున్న రతన్ లాల్‌ను ఉత్తర ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద అరెస్టు చేసినట్లు పోలీసులు […]

జ్ఞానవాపి శివలింగం పై ఫేస్ బుక్ పోస్ట్  ప్రొఫెసర్ అరెస్ట్
X

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో దొరికిన ‘శివలింగం’ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేశాడంటూ ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్‌ను గత రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

హిందూ కాలేజీలో పనిచేస్తున్న రతన్ లాల్‌ను ఉత్తర ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ., మరియు శాంతి, సామరస్య పరిస్థితులకు విఘాతం కలిగించే విధంగా ఒకరి మతాన్ని కించపర్చడం అనే సెక్షన్లు కూడా ఆయనపై ప్రయోగించారు.

ఢిల్లీకి చెందిన వినీత్ జిందాల్ అనే న్యాయవాది పోలీసులకిచ్చిన‌ ఫిర్యాదు మేరకు రతన్ లాల్‌పై మంగళవారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయన‌ ఇటీవల “శివలింగంపై అవమానకరమైన, రెచ్చగొట్టే ట్వీట్”ను షేర్ చేశారని తన ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు.
ఈ సమస్య చాలా సున్నితమైనదని, కోర్టులో పెండింగ్‌లో ఉందని లాయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అరెస్టుకు ముందు రతన్ లాల్ తన ఫేస్ బుక్ పోస్ట్‌ను సమర్థించుకున్నారు, “భారతదేశంలో, మీరు దేని గురించి మాట్లాడినా ఎవరో ఒకరి సెంటిమెంట్ దెబ్బతింటుంది. కాబట్టి ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేసాను. ఆ పరిశీలనలనే నేను వ్రాసాను. , నేను నా పోస్ట్‌లో చాలా సభ్యత కలిగిన‌ భాషను ఉపయోగించాను. ఇప్పటికీ నేను ఆమాటలకు కట్టుబడి ఉన్నాను. నన్ను నేను రక్షించుకుంటాను.” అన్నారు.

ALSO READ: జ్ఞానవాపి కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

First Published:  21 May 2022 2:18 AM GMT
Next Story