Telugu Global
NEWS

కేటీఆర్ యూకే పర్యటన.. రెండోరోజు హైలైట్స్

యూకే పర్యటనలో తొలిరోజు.. ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. రెండోరోజు పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్, పియర్సన్ కంపెనీ, హెచ్.ఎస్.బి.సి. సీనియర్ అధికారులతో కేటీఆర్ సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ తో కేటీఆర్ చర్చలు జరిపారు. తెలంగాణలో థామస్ లాయిడ్ గ్రూప్ కార్యకలాపాల విస్తరణపై వారు చర్చించారు. ఇక పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో […]

ktr-uk-second-day
X

యూకే పర్యటనలో తొలిరోజు.. ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. రెండోరోజు పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్, పియర్సన్ కంపెనీ, హెచ్.ఎస్.బి.సి. సీనియర్ అధికారులతో కేటీఆర్ సమావేశమయ్యారు.

థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ తో కేటీఆర్ చర్చలు జరిపారు. తెలంగాణలో థామస్ లాయిడ్ గ్రూప్ కార్యకలాపాల విస్తరణపై వారు చర్చించారు. ఇక పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల పై వారికి వివరించారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ తో పని చేసేందుకు పియర్సన్ సంస్థ సమ్మతి తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు. వారిని తెలంగాణకి ఆహ్వానించారు.

క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్ లర్ పోలార్డ్.. మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతోందని వారికి మంత్రి వివరించారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని కోరారు.

HSBC కి చెందిన పాల్ మెక్ పియర్సన్, బ్రాడ్ హిల్ బర్న్ లు మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని వారు కేటీఆర్ కి తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు చెప్పారు. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణతో మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేటీఆర్ కు తెలిపారు HSBC ప్రతినిధులు.

READ MORE: కేటీఆర్ యూకే పర్యటన.. రెండోరోజు హైలైట్స్

First Published:  19 May 2022 9:34 PM GMT
Next Story