Telugu Global
NEWS

హైదరాబాద్‌లో కొత్త వేరియంట్.. భారత్‌లో ఇదే తొలికేసు

భారత్ లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఏ-4 వెలుగులోకి వచ్చింది. దేశంలోనే తొలి కేసుని హైదరాబాద్ లో గుర్తించారు. ఈ మేరకు ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి హైదరాబాద్ కే పరిమితమైన ఈ బీఏ-4 వేరియంట్ ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపించి ఉండొచ్చనే అనుమానం ఉంది. అయితే ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, దీనిపై మరింత అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్ లో సబ్ […]

indias-1st-case-of-ba-4-omicron-variant-reported-in-hyderabad
X

భారత్ లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఏ-4 వెలుగులోకి వచ్చింది. దేశంలోనే తొలి కేసుని హైదరాబాద్ లో గుర్తించారు. ఈ మేరకు ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతానికి హైదరాబాద్ కే పరిమితమైన ఈ బీఏ-4 వేరియంట్ ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపించి ఉండొచ్చనే అనుమానం ఉంది. అయితే ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, దీనిపై మరింత అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు శాస్త్రవేత్తలు.

ఒమిక్రాన్ లో సబ్ వేరియంట్ ఇది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కొవిడ్ కల్లోలానికి కారణమైన వేరియంట్ ఇది. అయితే ఇది ఇప్పటి వరకూ భారత్ లో కనపడలేదు. ఇటీవల భారత్ లో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగిన తర్వాత కేవలం వైరస్ నిర్థారణే కాకుండా.. కొత్త వేరియంట్ జాడ కనుగొనేందుకు శాంపిల్స్ ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. దీనిపై ఇన్సాకాగ్ పరిశోధన చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈనెల 9న హైదరాబాద్ నుంచి సేకరించిన శాంపిల్స్ లో బీఏ-4 సబ్ వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు. దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బీఏ-4 తీవ్రత ఎలా ఉంటుంది..
దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ ఉద్ధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లలో బీఏ-4 కూడా ఒకటి. కొవిడ్ కి గురై యాంటీబాడీలు వృద్ధి చెందినవారిని కూడాఈ వేరియంట్ ఇబ్బంది పెట్టింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇది వదల్లేదు.

అయితే ఒమిక్రాన్ ప్రధాన వేరియంట్ కంటే ఈ సబ్ వేరియంట్ మరింత ప్రమాదకారి కాదని అంటున్నారు. అయితే దీని వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే హెచ్చరించింది. భారత్‌ లో ఇప్పటికే ఒమిక్రాన్‌ ఒకసారి వ్యాపించడం, టీకా కార్యక్రమం కూడా పూర్తి కావొస్తుండటంతో.. సబ్ వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండదనే అభిప్రాయం కూడా ఉంది.

కేసులు పెరిగినా ఉధృతి తక్కువగానే ఉంటుందని, ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం పెద్దగా ఉండదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (NCDC) అధికారులు చెబుతున్నారు.

First Published:  19 May 2022 10:09 PM GMT
Next Story