Telugu Global
National

భళా!..భారత మహిళ! ప్రపంచ బాక్సింగ్ లో పతకాల జోరు

రెండుదశాబ్దాల ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా భారత్ నిలిచింది.టర్కీలోని అంటాలియా వేదికగా ముగిసిన 2022 ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో భారతజట్టు ఓ స్వర్ణంతో సహా మొత్తం 3 పతకాలు సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచింది. మేరీకోమ్ నుంచి నిఖత్ జరీన్ వరకూ… 2002 నుంచి మాత్రమే మహిళలకు ప్రపంచ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్త్తూ వస్తున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ మహిళాబాక్సింగ్ లో మూడు అత్యుత్తమ, విజయవంతమైన జట్లలో ఒకటిగా భారత్ గుర్తింపు సంపాదించింది. […]

మహిళా బాక్సింగ్
X

రెండుదశాబ్దాల ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా భారత్ నిలిచింది.టర్కీలోని అంటాలియా వేదికగా ముగిసిన 2022 ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో భారతజట్టు ఓ స్వర్ణంతో సహా మొత్తం 3 పతకాలు సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచింది.

మేరీకోమ్ నుంచి నిఖత్ జరీన్ వరకూ…

2002 నుంచి మాత్రమే మహిళలకు ప్రపంచ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్త్తూ వస్తున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ మహిళాబాక్సింగ్ లో మూడు అత్యుత్తమ, విజయవంతమైన జట్లలో ఒకటిగా భారత్ గుర్తింపు సంపాదించింది.

2002 ప్రారంభ ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో మేరీకోమ్ బంగారు బోణీ కొట్టిన నాటినుంచి..ప్రస్తుత 2022 ప్రపంచ పోటీలలో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించేవరకూ…ఐదుగురు భారత మహిళలు విశ్వవిజేతలుగా నిలువగలిగారు.

2002 ప్రపంచకప్ నుంచి 2018 ప్రపంచకప్ వరకూ మేరీకోమ్ ఆరు బంగారు పతకాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది.

2002, 2005, 2006, 2008, 2010 , 2018 ప్రపంచకప్ టోర్నీలలో మేరీకోమ్ స్వర్ణ పతకాలు సాధిస్తూ వచ్చింది. 2006 ప్రపంచకప్ పోటీలలో భారత్ కే చెందిన మరో ముగ్గురు బాక్సర్లు ( సరితా దేవి, జెన్నీ, లేఖ ) బంగారు పతకాలు నెగ్గి దేశానికి ఖ్యాతి తెచ్చి పెట్టారు.

పరువు దక్కించిన నిఖత్ జరీన్..

టర్కీలోని అంటాలియా నగరం వేదికగా..ప్రపంచ మహిళా బాక్సింగ్ సమాఖ్య రెండుదశాబ్దాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన 2022 టోర్నీలో మొత్తం 73 దేశాలకు చెందిన 310 బాక్సర్లు వివిధ తరగతుల్లో తలపడ్డారు.

భారత్ మొత్తం 12మంది సభ్యులజట్టుతో బరిలో నిలిచింది. ఎనిమిది మంది భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ చేరుకోగా..ముగ్గురు మాత్రమే మెడల్ రౌండ్ లో మిగిలారు.

52 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ బంగారు పతకం నెగ్గడం ద్వారా భారత్ పరువు దక్కించింది. 2018లో మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ బంగారు పతకం సాధించిన తరువాత భారత్ కు మరో స్వర్ణపతకం అందించిన మహిళగా నిఖత్ నిలిచింది.

మహిళల 57 కిలోల విభాగంలో మనీషా, 63 కిలోల విభాగంలో పర్వీన్ కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మొత్తం మీద భారత బృందం మూడు పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆతిథ్య టర్కీ, భారత్ కు చెందిన ఎనిమిదేసిమంది బాక్సర్లు మాత్రమే వివిధ విభాగాలలో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోడం విశేషం.

భారత్ ఖాతాలో 39 పతకాలు..

2002 నుంచి 2022 ప్రపంచకప్ టోర్నీల వరకూ గత రెండు దశాబ్దాల కాలంలో భారత మహిళలు మొత్తం 39 పతకాలు సాధించగలిగారు. ఇందులో 10 మాత్రమే స్వర్ణ పతకాలు ఉన్నాయి. 8 రజత, 21 కాంస్యాలతో కలిపి భారత్ 39 పతకాలు సాధించగలిగింది.

మహిళా బాక్సింగ్ చరిత్రలో రష్యా 60 పతకాలు, చైనా 50 పతకాలతో మొదటి రెండు అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. భారత్ 39 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

“Winning a medal at the world’s is always a dream and Nikhat could achieve it so early is extremely commendable. We, at BFI, are proud that our boxers have not only made all of us proud but each of their boxing journeys is inspiring for the upcoming generations,” BFI President Ajay Singh said.

“On behalf of the Boxing Federation of India, I congratulate Nikhat and bronze medal winners Parveen and Manisha as well as the coaches and support staff for this achievement. Our eight boxers qualified for the quarter-finals which was joint most and shows the strength of Indian boxing,” he added.

First Published:  20 May 2022 2:47 AM GMT
Next Story