Telugu Global
NEWS

ఐపీఎల్ లో రాహుల్ షో ఐదోసారి 500 పరుగుల రికార్డు

ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ సమరంలో రికార్డుల మోత మోగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన 14వ రౌండ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆఖరి బంతి గెలుపుతో ప్లేఆఫ్ రౌండ్ కు అర్హత సంపాదించింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే-ఆప్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిస్తే…లక్నో మొత్తం రౌండ్లలో 9 విజయాలు, 5 పరాజయాల రికార్డుతో 18 పాయింట్లు సాధించడం ద్వారా టైటిల్ రేస్ లో నిలిచింది. కెప్టెన్ […]

పీఎల్ లో రాహుల్ షో ఐదోసారి 500 పరుగుల రికార్డు
X

ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ సమరంలో రికార్డుల మోత మోగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన 14వ రౌండ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్

జట్టు ఆఖరి బంతి గెలుపుతో ప్లేఆఫ్ రౌండ్ కు అర్హత సంపాదించింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే-ఆప్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిస్తే…లక్నో మొత్తం రౌండ్లలో 9 విజయాలు, 5 పరాజయాల రికార్డుతో 18 పాయింట్లు సాధించడం ద్వారా టైటిల్ రేస్ లో నిలిచింది.

కెప్టెన్ రాహుల్ 500 రికార్డు

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తనజట్టును ముందుండి ప్లేఆఫ్ రౌండ్ కు చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన కీలక 14వ రౌండ్ పోరులో సహఓపెనర్ క్వింటన్ డి కాక్ తో కలసి మొదటి వికెట్ కు 210 పరుగుల అజేయభాగస్వామ్యం నెలకొల్పడంలో ప్రధానపాత్ర వహించాడు.

ఈ క్రమంలో 68 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా సీజన్లో 500 పరుగుల రికార్డును అధిగమించగలిగాడు. గత ఐదుసీజన్లుగా 500కు పైగా పరుగులు
సాధించిన ఏకైక, భారత తొలి బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.

2018 – 2022

గత సీజన్ వరకూ కింగ్స్ పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించిన డాషింగ్ ఓపెనర్ రాహుల్ సీజన్ కు 500 పరుగుల చొప్పున సాధించడం ఇదే మొదటిసారి కాదు.

2018 సీజన్ నుంచి గత ఐదేళ్లుగా ప్రతిసీజన్ లోనూ 500 పరుగుల మైలురాయిని చేరిన ఏకైక, తొలి ఆటగాడు రాహుల్ మాత్రమే.

2018 సీజన్లో 659 పరుగులు, 2019 సీజన్లో 593 పరుగులు, 2020 సీజన్లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు.

అంతేకాదు..2021 సీజన్లో 13 మ్యాచ్ లు ఆడి 616 పరుగులు నమోదు చేశాడు.

ఏడాదికి 15 కోట్ల రూపాయల కాంట్రాక్టుపై లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రాహుల్ ఆడుతున్నాడు.

Click Here For More Updates! teluguglobal.in

First Published:  18 May 2022 9:45 PM GMT
Next Story