Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కొత్త సినిమా మోషన్ పోస్టర్

వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్. ఈ హీరో తన నెక్ట్స్ సినిమాను మరోసారి ఎనౌన్స్ చేశాడు. కొరటాల దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ న‌టిస్తున్న 30వ చిత్ర‌మిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం (మే 20)న […]

ntr30-motion-poster
X

వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్. ఈ హీరో తన నెక్ట్స్ సినిమాను మరోసారి ఎనౌన్స్ చేశాడు. కొరటాల దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

ఎన్టీఆర్ న‌టిస్తున్న 30వ చిత్ర‌మిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం (మే 20)న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చేలా ఈ మోస‌న్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు.

ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెష్ చెప్ప‌డానికి ..NTR 30కి సంబంధింధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్లో ప‌క్కా మాస్ డైలాగ్‌ చెబుతున్నాడు. ఆ డైలాగ్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు..

First Published:  19 May 2022 10:25 AM GMT
Next Story