Telugu Global
Others

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్..

నిజామాబాద్ ముద్దు బిడ్డ, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. ఇస్తాంబుల్‌ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌ లో నిఖత్‌ జరీన్‌ ఫైనల్స్ ఎంపిక కావడమే ఓ చరిత్ర అనుకుంటే.. ఏకంగా స్వర్ణం కైవసం చేసుకుని ఆనందాన్ని రెట్టింపు చేసింది. 52 కిలోల విభాగంలో ఫైనల్‌ లో జిట్‌ పాంగ్ (థాయ్‌ లాండ్‌)పై 5-0 తేడాతో అద్భుత […]

nikhat-zareen-won-gold-medal
X

నిజామాబాద్ ముద్దు బిడ్డ, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. ఇస్తాంబుల్‌ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌ లో నిఖత్‌ జరీన్‌ ఫైనల్స్ ఎంపిక కావడమే ఓ చరిత్ర అనుకుంటే.. ఏకంగా స్వర్ణం కైవసం చేసుకుని ఆనందాన్ని రెట్టింపు చేసింది.

52 కిలోల విభాగంలో ఫైనల్‌ లో జిట్‌ పాంగ్ (థాయ్‌ లాండ్‌)పై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌ గా నిలిచిన తొలి తెలంగాణ బిడ్డగా రికార్డు నమోదు చేసింది నిఖత్. స్వర్ణం గెలవడం ఓ అద్భుతం అయితే.. 5-0 తేడాతో ప్రత్యర్థికి పాయింట్లేవీ దక్కకుండా ఘన విజయం సాధించడం మరో అద్భుతం.

ఐదో అమ్మాయి నిఖత్..
ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన మహిళా బాక్సర్లు కేవలం నలుగురే ఉన్నారు. వారి సరసన నిఖత్ ఐదో అమ్మాయిగా చేరింది. నిఖత్ కంటే ముందు మేరీ కోమ్‌, సరితా దేవి, ఆర్ఎల్ జెన్ని, కెసి లేఖ మాత్రమే గోల్డ్‌ మెడల్‌ సాధించారు. వారి సరసన నిఖత్ కూడా చేరడం విశేషం.

వరుస విజయాలు..
ఈ ఏడాది ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ లో 52 కేజీల విభాగంలో స్వర్ణపతకం గెలుచుకుంది నిఖత్. జూనియర్‌ స్థాయిలో ఆమెకి ఇది రెండో పతకం. టర్కీ ఆతిథ్యంలో జరుగుతున్న ఈ ప్రపంచ బాక్సింగ్ సమరంలో 73 దేశాలకు చెందిన 310 మంది బాక్సర్లు వివిధ విభాగాలలో పోటీపడుతున్నారు. నిఖత్ జరీన్ ఈ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం రెండోసారి. రెండోసారికే స్వర్ణ పతకం సాధించడం నిజంగా అద్భుతం.

First Published:  19 May 2022 11:12 AM GMT
Next Story