Telugu Global
National

150 మంది ఉద్యోగులను తొలగించిన నెట్‌ఫ్లిక్స్‌

ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ 150 మంది ఉద్యోగులను తొలగించింది. తమ వినియోగదారులలో గణనీయమైన తగ్గుదల వల్ల ఆదాయం కోల్పోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీదుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ తొలగించిన ఉద్యోగులందరూ అమెరికా బేస్ గా పని చేస్తున్నవారే “మా ఆదాయ వృద్ధి మందగించడం వల్ల కంపెనీ వ్యయాన్ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విచారకరంగా, మేము ఈ రోజు దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించవలసి వచ్చింది .” అని నెట్‌ఫ్లిక్స్ […]

150 మంది ఉద్యోగులను తొలగించిన నెట్‌ఫ్లిక్స్‌
X

ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ 150 మంది ఉద్యోగులను తొలగించింది. తమ వినియోగదారులలో గణనీయమైన తగ్గుదల వల్ల ఆదాయం కోల్పోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీదుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ తొలగించిన ఉద్యోగులందరూ అమెరికా బేస్ గా పని చేస్తున్నవారే

“మా ఆదాయ వృద్ధి మందగించడం వల్ల కంపెనీ వ్యయాన్ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విచారకరంగా, మేము ఈ రోజు దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించవలసి వచ్చింది .” అని నెట్‌ఫ్లిక్స్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. మొదటి త్రైమాసికంలో ఊహించని విధంగా 2 లక్షల‌ మంది సబ్‌స్క్రైబర్లను నష్ట పోవడం, ఇదే కాలంలో మరో 2 మిలియన్ల మంది నష్టపోయే సూచన కనపడుతూ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. గత నెల చివరిలో, నెట్‌ఫ్లిక్స్ తన మార్కెటింగ్ శాఖ పునర్నిర్మాణంలో భాగంగా స్ట్రీమింగ్ సేవ కోసం చలనచిత్రాలు, టీవీ షోలను ప్రమోట్ చేసే వెబ్‌సైట్ ‘టుడమ్’లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది.

కాగా న్యూయార్క్‌లో నెట్‌ఫ్లిక్స్ షేర్లు 2.6% లాభపడి 191.40 డాలర్లకు చేరుకున్నాయి. నవంబర్ 2021లో ఇంట్రాడే గరిష్ట స్థాయి 700.99 డాలర్ల నుండి స్టాక్ 70% కంటే ఎక్కువ క్షీణించింది.

First Published:  19 May 2022 3:48 AM GMT
Next Story