Telugu Global
Cinema & Entertainment

పెళ్లితో ఒక్కటైన హీరోహీరోయిన్లు

సినీ ఇండస్ట్రీలో మరో జంట ఒక్కటైంది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్స్ లోకి చేరింది. వాళ్లే ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, నిన్న వివాహ బంధంతో ఒక్కటైంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆది-నిక్కీ వివాహం జరిగింది. తమిళ్ లో 3 సినిమాలు కలిసి చేశారు ఆది-నిక్కీ. వీటిలో మరకతమణి అనే సినిమా బాగా హిట్టయింది. తొలి సినిమా చేసినప్పట్నుంచే ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు. లాక్ డౌన్ […]

పెళ్లితో ఒక్కటైన హీరోహీరోయిన్లు
X

సినీ ఇండస్ట్రీలో మరో జంట ఒక్కటైంది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్స్ లోకి చేరింది. వాళ్లే ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట, నిన్న వివాహ బంధంతో ఒక్కటైంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆది-నిక్కీ వివాహం జరిగింది.

తమిళ్ లో 3 సినిమాలు కలిసి చేశారు ఆది-నిక్కీ. వీటిలో మరకతమణి అనే సినిమా బాగా హిట్టయింది. తొలి సినిమా చేసినప్పట్నుంచే ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఆ స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు.

అప్పట్నుంచి తరచుగా మీడియా ముందుకొస్తున్న ఈ జంట, నిన్న పెళ్లితో ఒక్కటైంది. ఈ పెళ్లికి కేవలం ఆది, నిక్కీ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వీళ్లతో పాటు సందీప్ కిషన్, నాని పెళ్లికి హాజరైన సెలబ్రిటీల లిస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం రామ్ సినిమా వారియర్ లో విలన్ గా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. అతడి కెరీర్ తెలుగు, తమిళ్ లో మంచి ఊపుమీదుంది

First Published:  19 May 2022 10:39 AM GMT
Next Story