Telugu Global
NEWS

వైసీపీ సభ్యత్వం తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ఆర్‌ కృష్ణయ్య సమాధానం

తెలంగాణకు చెందిన ఆర్‌. కృష్ణయ్యకు ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ టికెట్ ఇస్తుండడంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఏపీ బీసీ సంఘాల నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఆర్‌ కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం అంటే.. ఏపీలోని బీసీలను, ఉద్యమకారులను అవమానించడమేనని ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేత క్రాంతి కుమార్ అభ్యంతరం తెలిపారు. ఏపీలో బీసీ నాయకత్వం ఎదగకుండా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. వైసీపీని నమ్ముకుని పనిచేస్తున్న బీసీ నేతలు […]

R-Krishnaiah-join-ycp
X

తెలంగాణకు చెందిన ఆర్‌. కృష్ణయ్యకు ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ టికెట్ ఇస్తుండడంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఏపీ బీసీ సంఘాల నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఆర్‌ కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం అంటే.. ఏపీలోని బీసీలను, ఉద్యమకారులను అవమానించడమేనని ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేత క్రాంతి కుమార్ అభ్యంతరం తెలిపారు. ఏపీలో బీసీ నాయకత్వం ఎదగకుండా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. వైసీపీని నమ్ముకుని పనిచేస్తున్న బీసీ నేతలు కళ్లు తెరవాలన్నారు.

టీడీపీ కూడా ఆర్‌ కృష్ణయ్యకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది. కుర్చీలు లేని కార్పొరేషన్ల పదవులు ఏపీలోని బీసీలకు కేటాయించి.. తెలంగాణ వాళ్లకు అత్యున్నత రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడం అంటే ఏపీలోని బీసీలకు వెన్నుపోటు పొడవటమేనని టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. రాజ్యసభకు వెళ్లే అర్హత, యోగ్యత ఉన్న వారు ఏపీలోని 140 బీసీ కులాల్లో ఒక్కరూ లేరా అని ప్రశ్నించారు.

ఈ విమర్శలకు ఒక చర్చ కార్యక్రమంలో ఆర్‌ కృష్ణయ్య స్పందించారు. తాను పోరాటాలు చేసింది ఒక్క తెలంగాణలోని బీసీల కోసమే కాదని, అన్ని రాష్ట్రాల్లోని బీసీల కోసం పోరాటం చేశానన్నారు. ఆ సేవలను గుర్తించే జగన్‌ తనకు రాజ్యసభ ఇచ్చారన్నారు. తొలుత టీడీపీలో చేరారు, ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు, ఇప్పుడు వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు ఇలా పార్టీలు మార్చడం ఏంటి అని ప్రశ్నించగా.. తాను పార్టీలు మారానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. తాను పార్టీల్లో చేరినట్టు, కండువాలు కప్పుకున్నట్టు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.

ఇప్పుడు వైసీపీ సభ్యత్వం తీరుకుంటారా?, పార్టీ కండువా కప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ఆర్‌ కృష్ణయ్య సూటిగా సమాధానం ఇవ్వలేదు. జగన్‌ ఆదేశాల మేరకు, పార్టీకి లోబడి పనిచేస్తా అని చెప్పారు. జగన్‌మోహన్ రెడ్డి కూడా బీసీల కోసం పోరాటం చేయాలంటూ తనకు రాజ్యసభ టికెట్‌ ఇస్తున్నారన్నారు. 2024లో వైసీపీ తరపున ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు.. తనను గుర్తించి రాజ్యసభ ఇచ్చిన జగన్‌ మోహన్ రెడ్డికి తప్పకుండా తాము మద్దతుగా ఉంటామని ఆర్‌ కృష్ణయ్య చెప్పారు.

వైసీపీ సభ్యత్వం తీసుకుంటానని గానీ, కండువా కప్పుకుంటానని గానీ నేరుగా ఆర్‌ కృష్ణయ్య చెప్పలేదు. బీఫాం అందజేసే రోజు అభ్యర్థులకు జగన్ కండువాలు కప్పుతుంటారు. పరిమల్ నత్వానీకి అలాగే కండువా కప్పారు. ఆర్‌ కృష్ణయ్యకు అలా కండువా కప్పుతారా? లేదా అన్నది చూడాలి. అత్యున్నతమైన రాజ్యసభ సీటు ఇస్తున్నారు కాబట్టి కండువా కప్పుకోవడానికి ఆర్‌ కృష్ణయ్య పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు.

First Published:  17 May 2022 8:58 PM GMT
Next Story