Telugu Global
Health & Life Style

వయసుని వెనక్కు తగ్గించొచ్చట! ఎలాగంటే..

కొంతమందిని చూడగానే వారి వయసుని ఇట్టే అంచనా వేయొచ్చు. కానీ మరికొందరి వయసుని మాత్రం అస్సలు పసిగట్టలేము. దీనికి కారణం వారి చర్మానికి సరిగా వయసు అవ్వకపోవడమే. దీన్నే ఆసరాగా తీసుకుని శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేసి చివరికి వయసుకి అడ్డుకట్ట వేసే కొన్ని విషయాలను గుర్తించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలంతో పాటు వయసు మీద పడటం సహజం. కానీ వృద్ధాప్యం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి వయసు నెమ్మదిగా మీద పడుతుంటే మరికొందరికి ముందే […]

How to age in reverse?
X

కొంతమందిని చూడగానే వారి వయసుని ఇట్టే అంచనా వేయొచ్చు. కానీ మరికొందరి వయసుని మాత్రం అస్సలు పసిగట్టలేము. దీనికి కారణం వారి చర్మానికి సరిగా వయసు అవ్వకపోవడమే. దీన్నే ఆసరాగా తీసుకుని శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేసి చివరికి వయసుకి అడ్డుకట్ట వేసే కొన్ని విషయాలను గుర్తించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలంతో పాటు వయసు మీద పడటం సహజం. కానీ వృద్ధాప్యం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి వయసు నెమ్మదిగా మీద పడుతుంటే మరికొందరికి ముందే వృద్ధాప్యం వచ్చినట్టు కనబడుతుంది. ఇలా వయసు మీద పడడంలో ఉండే మార్పులకు రెండు కారణాలున్నాయి. ఒకటి క్రోనోలాజికల్‌ ఫ్యాక్టర్..అంటే పుట్టిన రోజు ఆధారంగా వచ్చే వయసు. ఇది అందరికీ ఒకేలా ఉంటుంది. రెండోది బయోలాజికల్‌ ఫ్యాక్టర్.. అంటే శారీరకంగా జరిగే మార్పులు. ఇది మనిషిని బట్టి మారుతుంటుంది. ఈ రెండు ఫ్యాక్టర్స్‌ను బట్టి వయసు మీద పడడం అనేది జరుగుతుంది. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అనుకూలిస్తే వయసు లేటుగా మీద పడే అవకాశముంటుంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నదేంటంటే లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా శారీరక వయసు నెమ్మదిగానూ సాగేలా చేయొచ్చట. అంటే దీనర్ధం ఆయుష్షు కాలాన్ని పెంచుకోవచ్చని కాదు. అరవై ఏళ్లలో కూడా యువకుల్లా చురుకుగా ఉండొచ్చని.

వృద్ధాప్య ప్రక్రియలో టెలోమేర్స్‌, మెథీలేషన్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. టెలోమేర్స్‌ అంటే శరీరంలోని కణాల క్రోమోజోమ్‌లకు ఉండే తోకల్లాంటివి. వీటి పొడవును బట్టి శారీరక వయసును నిర్ధారిస్తారు. వయసు మీద పడుతున్నకొద్దీ టెలోమేర్స్‌ పొడవు తగ్గుతూ వస్తుంటుంది. శారీరక వయసు ఎక్కువగా ఉన్నవారిలో ఇవి పొట్టిగా ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. టెలోమేర్స్‌ పొట్టిగా ఉన్నవారికి జబ్బుల ముప్పు ఎక్కువగా ఉండే అవకాశముంది.

ఇకపోతే మెథీలేషన్ అంటే మనిషి డీఎన్‌ఏలో ఉండే ఒకరకమైన కోడింగ్ లాంటిది. మనిషి డీఎన్‌ఏ అణువులకు కొన్ని మిథైల్‌ రసాయనాలు అంటుకొని పోతుంటాయి. దీన్నే డీఎన్‌ఏ మెథీలేషన్‌ అంటారు. వయసు మీద పడుతున్నకొద్దీ డీఎన్‌ఏకు అంటుకుపోయే రసాయనాల్లో మార్పులొస్తూ ఉంటాయి. ఈ మార్పులు వేగంగా జరిగితే వ్యక్తి వయసు ముందే మీదపడిపోతుంది.

ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత సైంటిస్టులు తేల్చినదేంటంటే.. వృద్ధాప్యాన్ని ఆపలేకపోవచ్చు గానీ శారీరకంగా త్వరగా వృద్ధులు కాకుండా చూసుకోవచ్చట. లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా టెలోమేర్స్‌ పొడవు పెరిగేలా, వృద్ధాప్యం వెనక్కి మళ్లేలా చేయొచ్చట.

టెలోమేర్స్ పొడవు పెరగాలంటే శాకాహారం ఎక్కువగా తినడం, వారానికొకసారి ఉపవాసం చేయడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర పోవడం, మెటబాలిజాన్ని పెంచే ఆహారాలు తీసుకోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండడం లాంటి అలవాట్లను పాటించాలని సైంటిస్టులు చెప్తున్నారు.

First Published:  18 May 2022 11:00 AM GMT
Next Story