Telugu Global
National

గుజరాత్ లో కాంగ్రెస్ కు షాక్.. పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా

ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో గుజరాత్ లో కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ట్విట్టర్ లో ఆయన తన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. ”ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ధైర్యంగా రాజీనామా చేస్తున్నాను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలందరూ స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. భవిష్యత్తులో గుజరాత్ […]

గుజరాత్ లో కాంగ్రెస్ కు షాక్.. పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా
X

ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో గుజరాత్ లో కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ట్విట్టర్ లో ఆయన తన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. ”ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ధైర్యంగా రాజీనామా చేస్తున్నాను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలందరూ స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. భవిష్యత్తులో గుజరాత్ కోసం నేను మరింత దృడంగా పని చేయగలనని నమ్ముతున్నాను.” అని ట్వీట్ చేశాడు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో, పటేల్ ఇలా వ్రాశారు, “కాంగ్రెస్‌ను సరైన దిశలో నడిపించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, పార్టీ నిరంతరం నా దేశం, మన సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.” అని రాశాడు.

“మన దేశ యువత బలమైన, సమర్థుడైన నాయకుడిని కోరుకుంటున్నారు. గత 3 సంవత్సరాలుగా, కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కేవలం ప్రతిదానిని వ్యతిరేకించే స్థాయికి దిగజారిందని నేను గుర్తించాను, అయితే ప్రజలు ఎల్లప్పుడూ తమ భవిష్యత్తు గురించి ఆలోచించే భారతదేశాన్ని ఆత్మ గల ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారు, ”అని ఆయన తన‌ లేఖలో పేర్కొన్నారు.

కాగా 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్.. కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీపై హార్దిక్ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని, పార్టీలో అంతర్గత పోరు తారా స్థాయిలో ఉందంటూ హర్దిక్ పలుమార్లు ఆవేదన వ్య‌క్తం చేశారు.

First Published:  18 May 2022 12:56 AM GMT
Next Story