Telugu Global
Health & Life Style

పొట్ట లైట్‌గా ఉండాలంటే ఇవి తినాలి

పొట్టలో బరువైన ఆహారం ఉన్నప్పుడు రోజంతా తెలియని నిస్సత్తువ, బద్దకం ఆవహిస్తాయి. అందుకే యాక్టివ్‌గా ఉండాలంటే పొట్టను ఎప్పుడూ లైట్‌గా ఉంచుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా పొట్ట లైట్‌గా అనిపించాలంటే తిన్నది వెంటనే జీర్ణమైపోవాలి. అలా కాకుండా ఈ రోజు తిన్నది రేపటి వరకూ అరగలేదంటే ఆ రోజంతా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. అందుకే పొట్ట లైట్‌గా ఉండాలంటే తేలికగా అరిగే ఆహారాలు తీసుకోవాలి. అవేంటంటే.. వెజిటబుల్స్ అన్నిరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తిన్న నాలుగైదు […]

పొట్ట లైట్‌గా ఉండాలంటే ఇవి తినాలి
X

పొట్టలో బరువైన ఆహారం ఉన్నప్పుడు రోజంతా తెలియని నిస్సత్తువ, బద్దకం ఆవహిస్తాయి. అందుకే యాక్టివ్‌గా ఉండాలంటే పొట్టను ఎప్పుడూ లైట్‌గా ఉంచుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పొట్ట లైట్‌గా అనిపించాలంటే తిన్నది వెంటనే జీర్ణమైపోవాలి. అలా కాకుండా ఈ రోజు తిన్నది రేపటి వరకూ అరగలేదంటే ఆ రోజంతా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. అందుకే పొట్ట లైట్‌గా ఉండాలంటే తేలికగా అరిగే ఆహారాలు తీసుకోవాలి. అవేంటంటే..

వెజిటబుల్స్

అన్నిరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తిన్న నాలుగైదు గంటల్లో అరిగిపోతాయి. అందుకే పొట్ట లైట్‌గా అనిపించాలంటే తినే ఆహారంలో వీటిని ఉండేలా చూసుకోవాలి. వెజిటేరియన్ ఫుడ్స్‌తో పోలిస్తే నాన్ వెజ్ ఫుడ్స్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా రెడ్ మీట్ అరగడానికి ఒకటి నుంచి రెండు రోజుల రోజంతా సమయం పడతుంది.

మసాలాలు తింటే

కూరగాయాలు తిన్నా సరే.. వాటిలో మసాలాలు, ఉప్పు, కారం లాంటివి ఎక్కువగా వాడినప్పుడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా రాత్రిళ్లు బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటివి తినడం వల్ల రాత్రితో పాటు తర్వాతి రోజు పగలు కూడా పొట్ట బరువుగా అనపిస్తుంది. అందుకే రాత్రిళ్లు తేలికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం.

సమపాళ్లలో

పొట్ట లైట్‌గా ఉండాలి కదా అని కేవలం కాయగూరలతో సరిపెడితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అందుకే ఎప్పుడైనా తీసుకునే ఆహారంలో కార్బో్హైడ్రేట్స్ 70 శాతం, ప్రొటీన్స్ 20 శాతం, ఫ్యాట్స్ 10 శాతం ఉండేలా చూసుకోవాలి. అలాగే భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉంటే తిన్నది వెంటనే అరిగేలా చేయొచ్చు.

ఇవి తినాలి

పొట్ట తేలికగా ఉండేందుకు బ్రౌన్ రైస్, గోధుమలు, మిల్లెట్స్, ఓట్స్, లాంటి ధాన్యాలను తీసుకోవాలి. అలాగే రాత్రిళ్లు సూప్స్ లాంటివి తీసుకోవడం ద్వారా పొట్టపై భారం పడకుండా ఉంటుంది. ఇకపోతే ఆహారంతో పాటు అరటి పండును కూడా తీసుకోవడం ద్వారా తిన్నది త్వరగా అరుగుతుంది.

First Published:  18 May 2022 12:00 PM GMT
Next Story