Telugu Global
National

మోడీ ప్రభుత్వం అమ్మేసిన 23 ప్రభుత్వ రంగ సంస్థలివే !

మోడీ ప్రభుత్వం 23 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మింది. దాని వల్ల వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డుపాలయ్యారు. దీని కారణంగా ఉపాది పొందుతున్న మరింత మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కే.నారాయణ హైదరాబాద్ లో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సీపీఐ […]

మోడీ
X

మోడీ ప్రభుత్వం 23 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మింది. దాని వల్ల వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డుపాలయ్యారు. దీని కారణంగా ఉపాది పొందుతున్న మరింత మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కే.నారాయణ హైదరాబాద్ లో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర 3వ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నారాయణ కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కైన బీజేపీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న 23 ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అమ్మేసిందని ధ్వ‌జమెత్తారు.

కాగా, నారాయణ చెప్పినట్టు మోడీ ప్రభుత్వం అమ్మేసిన ఆ 23 ప్రభుత్వరంగ సంస్థల వివరాలు..

1.ప్రాజెక్ట్ & డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్.
2. హిందుస్థాన్ ప్రీఫ్యాబ్ లిమిటెడ్. (HPL).
3. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్.
4. బ్రిడ్జ్ & రూఫ్ కో. ఇండియా లిమిటెడ్.
5. హిందుస్థాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్ (అనుబంధ సంస్థ).
6. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్.
7. భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్ లిమిటెడ్.
8. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
9. హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్ లిమిటెడ్ (అనుబంధ సంస్థ).
10. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.
11. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML).
12. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ (అనుబంధ సంస్థ).
13. NMDC యొక్క నాగర్నార్ స్టీల్ ప్లాంట్.
14. అల్లాయ్ స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్; సేలం స్టీల్ ప్లాంట్; SAIL యొక్క భద్రవతి యూనిట్లు.
15. పవన్ హన్స్ లిమిటెడ్.
16. ఎయిర్ ఇండియా మరియు దాని ఐదు అనుబంధ సంస్థలు.
17. HLL లైఫ్‌కేర్.
18. ఇండియన్ మెడిసిన్స్ & ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IMPCL).
19. కామరాజర్ పోర్ట్ లిమిటెడ్.
20. ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC).
21. కర్నాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్.
22. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్.
23. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (BCPL).

ALSO READ: వడ్డించేవాడు మనవాడైతే

First Published:  18 May 2022 4:28 AM GMT
Next Story