Telugu Global
NEWS

యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా 20వసారి సచిన్ టెండుల్కర్

మాస్టర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా తనదైన శైలిలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. అరుదైన రికార్డులు నెలకొల్పుతూ తనకు తానేసాటిగా నిలుస్తున్నాడు. 2013 నుంచి యునిసెఫ్ సేవలో.. మాస్టర్ సచిన్ టెండుల్కర్ వరుసగా 20వ సారి యునిసెఫ్‌ ‘గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా’ఎంపికకావడం ద్వారా అరుదైన ఘనతను, గౌరవాన్ని సొంతం చేసుకొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నిరుపేద బాలల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనిసెఫ్‌తో కలసి సచిన్‌ టెండూల్కర్‌ 2003 నుంచి పనిచేస్తున్నాడు. గత […]

యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా 20వసారి సచిన్‌
X

మాస్టర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా తనదైన శైలిలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. అరుదైన రికార్డులు నెలకొల్పుతూ తనకు తానేసాటిగా నిలుస్తున్నాడు.

2013 నుంచి యునిసెఫ్ సేవలో..
మాస్టర్ సచిన్ టెండుల్కర్ వరుసగా 20వ సారి యునిసెఫ్‌ ‘గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా’ఎంపికకావడం ద్వారా అరుదైన ఘనతను, గౌరవాన్ని సొంతం చేసుకొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నిరుపేద బాలల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనిసెఫ్‌తో కలసి సచిన్‌ టెండూల్కర్‌ 2003 నుంచి పనిచేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా యునిసెఫ్‌తో కలసి పనిచేయడం చాలా గొప్ప అదృష్టం. చిన్నారుల కలలకు రెక్కలు వచ్చేలా యూనిసెఫ్‌ చేస్తున్న ప్రయత్నాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రభావవంతమైన పనికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలు మా సొంతం. తదుపరి దశ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నా’అని టెండూల్కర్‌ సోమవారం ట్వీట్‌ చేశాడు. 2003లో పోలియో నివారణపై అవగాహన కల్పించేందుకు తొలిసారి యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టిన సచిన్‌.. 2008లో పారిశుధ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించే విధంగా ప్రచారం చేశాడు. 2013లో దక్షిణాసియా యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా పనిచేసిన టెండూల్కర్‌.. 2019లో సంస్థ కోసం మూడు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించాడు. 2022లో కూడా యునిసెఫ్ అంబాసిడర్ గా సచిన్ ను కొనసాగించడం తమకు గౌరవమని ఆ సంస్థ ప్రకటించింది.

ముంబై నిరుపేద బాలల సేవలో..
సచిన్‌ టెండుల్కర్ తన కుటుంబసభ్యుల సహకారంతో గత 20 సంవత్సరాలుగా ముంబై మురికివాడలలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. అప్నాలయ్ ట్రస్టు ద్వారా..మురికివాడలలో నివసించే లక్షలాది బాలలకు మెరుగైన జీవితం ఇవ్వడానికి తనవంతుగా కృషి చేస్తున్నాడు. ఈ కార్యక్రమాల కోసం తన సంపాదనలోని కోట్లరూపాయలు వ్యయం చేస్తున్నాడు. బాలలకు మెరుగైన విద్య,వైద్యం, పోషకాహారం అందాబాటులో ఉంచడమే లక్ష్యంగా అప్నాలయ సంస్థ నిరంతరం పాటుపడుతోంది.
సచిన్ భార్య అంజలి, అత్తగారి పర్యవేక్షణలో ప్రత్యేకబృందం కృషి చేస్తోంది. ఇటీవలే ముంబైలోని ఎస్‌ఆర్‌సీసీ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో పలువురు నిరుపేద చిన్నారులకు ఆర్థిక సహకారం అందించాడు. 2019 డిసెంబర్‌లో టెండూల్కర్ ‘స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్‌ దియా ఫౌండేషన్‘ ద్వారా డిజిటల్ తరగతి గదులను నడపడానికి గ్రీన్ ఎనర్జీని అందించడానికి, సౌర లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అలాగే ముంబైలోని భివాలిలోని శ్రీ గాడ్గే మహారాజ్ ఆశ్రమ పాఠశాలలో ఆధునిక లెర్నింగ్‌ సదుపాయాలతో పాటు క్రీడల నిర్వహణకు వసతులు కల్పించాడు.

గిరిజన బాలల కోసం..
పోషకాహార లోపం, నిర్లక్ష్యరాస్యతతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు సచిన్ ముందుకు వచ్చాడు.. ఓ ఎన్టీజీవోతో కలిసి 560 మంది నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లాలోని మారుమాల గ్రామాల్లోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్‌ ఝిల్‌లోని గిరిజన తెగలకు చెందిన చిన్నారులకు టెండూల్కర్‌ ఫౌండేషన్‌ పోషకాహారం, విద్యను అందిస్తోంది. ఎన్టీఓ పరివార్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సచిన్‌ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాడు. క్రికెట్‌ దిగ్గజం అట్టడుగు వర్గాలకు చెందిన చిన్నారులను ఆదుకునేందుకు ముందుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

రాజ్యసభ సభ్యుడిగా..
గతంలో రాజ్యసభ్య సభ్యుడిగా వ్యవహరించిన సచిన్.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని.. అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశాడు.
అంతేకాదు.. రాజ్యసభ సభ్యుడిగా ఐదేళ్ల కాలానికి తాను అందుకొన్న 90 లక్షల రూపాయల జీతభత్యాలను.. ప్రధానమంత్రి సహాయనిధికి అందచేసి తన పెద్దమనసు చాటుకొన్నాడు.
వందలాదిమంది పేదల హృద్రోగశస్త్ర్ర చికిత్సల కోసం పలు రకాలుగా సాయం అందిస్తూ క్రికెట్ దేవుడిగా తన పేరును సార్థకం చేసుకొన్నాడు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు అక్రమ, సక్రమ మార్గాలలో వందలకోట్లు సంపాదించినా..సమాజసేవకు వినియోగించేది నామమాత్రమే. సచిన్ మాత్రం తన సంపాదనలో కొంత భాగాన్ని నిరుపేదల బాగుకోసం ఉపయోగించడం, నిస్వార్థంగా ఖర్చు చేయటం స్ఫూర్తిదాయకం, అభినందనీయం.

First Published:  17 May 2022 12:47 AM GMT
Next Story