Telugu Global
NEWS

కిరణ్‌ కుమార్‌ రెడ్డి రుణం తీర్చుకుంటారా?

మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సేవలను వాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఉమ్మడి ఏపీ ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌ కుమార్ రెడ్డి.. అప్పట్లో ఆఖరి బంతి అంటూ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించకపోవడంతో కాంగ్రెస్‌ను వదిలేసి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి తమిళనాడు కాంగ్రెస్ నేత చిదంబరానికి బాగా దగ్గరి వ్యక్తిగా ఉండేవారు. సీఎం పదవి రావడానికి చిదంబరం కూడా అప్పట్లో సాయం చేశారన్న […]

కిరణ్‌ కుమార్‌ రెడ్డి రుణం తీర్చుకుంటారా?
X

మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సేవలను వాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఉమ్మడి ఏపీ ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌ కుమార్ రెడ్డి.. అప్పట్లో ఆఖరి బంతి అంటూ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించకపోవడంతో కాంగ్రెస్‌ను వదిలేసి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి తమిళనాడు కాంగ్రెస్ నేత చిదంబరానికి బాగా దగ్గరి వ్యక్తిగా ఉండేవారు. సీఎం పదవి రావడానికి చిదంబరం కూడా అప్పట్లో సాయం చేశారన్న ప్రచారం నడిచింది.

కాంగ్రెస్‌లోనే ఉంటే విభజన పాపం, ఆ భారం అంతా తన నెత్తిన పడుతుందన్న ఉద్దేశంతోపాటు.. కాంగ్రెస్‌లోనే కొనసాగితే ఆ అభ్యర్థులకు తనతోనే ఖర్చు పెట్టిస్తారన్న భావనతోనే, ఆ భారాల నుంచి తప్పించుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

అయితే చెప్పుల పార్టీ అట్లర్‌ ప్లాప్‌ అయింది. పార్టీ కనుమరుగు అయింది. కిరణ్‌ బెంగళూరుకు పరిమితం అయ్యారు. 2018 జులైలో తిరిగి ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటీ యాక్టివ్‌గా ఐతే లేరు. ఇప్పటికే వరుస ఓటమితో కుదేలైన కాంగ్రెస్.. ఇక ఆఖరి ప్రయత్నం అన్నట్టుగా ఈసారి సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించుకుంది. దేశ వ్యాప్త పాదయాత్రకు సన్నద్దమవుతోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో నాయకత్వాలను బలోపేతం చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఏపీ బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా కిరణ్‌ కుమార్ రెడ్డికి.. ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం నుంచి కబురు వచ్చింది. ఆయనకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం శైలజానాథ్ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ అడుగు ముందుకేసింది లేదు.

కిరణ్‌ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్‌ పార్టీ లేచి పరుగు అందుకోకపోయినా.. కనీసం యాక్టివ్ మోడ్‌లోకి వస్తుందన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉంది. ఉమ్మడి రాష్ట్ర ఆఖరి సీఎంగా అన్ని విధాలుగా బలోపేతం అయిన కిరణ్‌ కుమార్ రెడ్డి.. ఆ బలాన్ని అప్పట్లో కాంగ్రెస్‌ కోసం వాడకుండా ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని అప్పటి రుణాన్ని తీర్చుకుంటారా అన్నది చూడాలి.

First Published:  17 May 2022 3:03 AM GMT
Next Story