Telugu Global
Cinema & Entertainment

777 ఛార్లీ మూవీ తెలుగు ట్రయిలర్ రివ్యూ

ధర్మ అనే వ్యక్తి లోకం వేరు ..”నా వరకు నేను కరెక్ట్” అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్ర‌పంచం. త‌న జీవితంలో ఇంట్రెస్టింగ్‌గా ఏదీ లేద‌ని అనుకునే ధ‌ర్మ జీవితంలో ఛార్లి అనే కుక్క ఎంట్రీ ఇస్తుంది. ముందు ధ‌ర్మ‌కి ఛార్లి అంటే అస్స‌లు ప‌డ‌దు. దాన్ని ఎవ‌రికైనా ఇచ్చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ధ‌ర్మ‌ ఓసారి ఆప‌ద‌లో […]

777 ఛార్లీ మూవీ తెలుగు ట్రయిలర్ రివ్యూ
X

ధర్మ అనే వ్యక్తి లోకం వేరు ..”నా వరకు నేను కరెక్ట్” అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్ర‌పంచం. త‌న జీవితంలో ఇంట్రెస్టింగ్‌గా ఏదీ లేద‌ని అనుకునే ధ‌ర్మ జీవితంలో ఛార్లి అనే కుక్క ఎంట్రీ ఇస్తుంది.

ముందు ధ‌ర్మ‌కి ఛార్లి అంటే అస్స‌లు ప‌డ‌దు. దాన్ని ఎవ‌రికైనా ఇచ్చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ధ‌ర్మ‌ ఓసారి ఆప‌ద‌లో చిక్కుంటాడు. అప్పుడు ఛార్లి అత‌న్ని బ‌తికిస్తుంది. అప్పుడు ఛార్లి త‌న‌పై చూపించే ప్రేమ‌కు ధ‌ర్మ మ‌న‌సు క‌రిగిపోతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెరుగుతుంది.

అలాంటి ఛార్లి, ధ‌ర్మ ఎందుకు కాశ్మీర్‌కి వెళ‌తారు. ఛార్లిని వెతుక్కుంటూ వెళ్లిన ధ‌ర్మ‌కు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులు ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే జూన్ 10న ప్ర‌పంచవ్యాప్తంగా తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ‘777 ఛార్లి’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న హీరో ర‌క్షిత్ శెట్టి నటించిన చిత్రం ‘777 ఛార్లి’ . ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా కనిపించగా.. కీలక పాత్రలో బాబీ సింహ అలరించబోతున్నాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటుడు రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నాడు. ఈ సినిమా కంటెంట్ చూసి ప్రజెంటర్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు రానా.

https://www.youtube.com/watch?v=DjNCn_B3fFg

First Published:  16 May 2022 10:37 AM GMT
Next Story